iDreamPost
android-app
ios-app

Samantha Naga Chaitanya divorce -మొత్తానికి పోరాడి హక్కులు సాధించిన సమంత

Samantha Naga Chaitanya divorce -మొత్తానికి పోరాడి హక్కులు సాధించిన సమంత

సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చాక ఏది నిజం ఏది అబద్దం అనే విషయాన్ని కూడా నమ్మలేని పరిస్థితి నెలకొంటోంది. సాధారణ పౌరులే సోషల్ మీడియాకు బాధితులుగా మారుతున్నారు అంటే, సెలబ్రిటీల పరిస్థితి ఇంకా దారుణం. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి పెద్దగా ఓపెన్ అవ్వరు, అదే వారి జీవితాలకు పెను శాపంగా మారుతోంది. వారి జీవితాల గురించి రకరకాల విశ్లేషణలు, కల్పనలు, అద్భుత కల్పనలు తెరమీదకు తెస్తున్నాయి మీడియా సంస్థలు. సరిగ్గా కొద్ది రోజుల క్రితం అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో కూడా అదే జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు వాళ్ళు ప్రకటించక ముందే సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అయితే వారు తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి రకరకాల విశ్లేషణలు సమంత గురించి ఎక్కువ అయ్యాయి.

సాధారణంగా పురుషాధిక్య ప్రపంచంలో బతుకుతున్నాం కాబట్టి ఎవరు తప్పు చేసినా స్త్రీ మీదకి ఎక్కువగా చూపుడు వేళ్ళు వెళుతూ ఉంటాయి.. సమంత, నాగచైతన్య విషయంలో కూడా అదే జరిగింది. అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో? ఎవరికీ తెలియదు కానీ సమంత ఎవరితోనో ఎఫైర్ పెట్టుకుందని కొంతమంది, లేదు ఆమెకు పిల్లల్ని కనే ఉద్దేశం లేదు అందుకే నాగచైతన్య విడిపోతున్నాడు అని కొంతమంది, ఆమె సినిమాలు చేసే ఉద్దేశంతో బరితెగించి నటిస్తుంది కాబట్టి నాగచైతన్య విడాకులు ఇస్తున్నాడని కొంతమంది ఇలా రకరకాల ప్రచారాలు మొదలు పెట్టారు. ఈ విషయంలో ముందు చాలా బాధపడిన సమంత సోషల్ మీడియా వేదికగా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది. నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు నేను ఏ తప్పూ చేయలేదు ఇలాంటి ప్రచారాలతో నన్ను వెనక్కి లాగాలని అనుకుంటే అది మీ మూర్ఖత్వమే అవుతుందని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇలా చెబితేనన్నా ప్రచారాలు ఆగుతాయి అని అనుకుంటే అది జరగలేదు.. చివరికి ఆమె లీగల్ గా ముందుకు వెళ్లాలని భావించి తన మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి రకరకాల విశ్లేషణలు చేస్తున్న మూడు యూట్యూబ్ ఛానల్స్, వృత్తిరీత్యా డాక్టర్ అయిన మరో వ్యక్తి మీద కేసులు పెట్టింది. సుమారు వారం రోజుల నుంచి సాగుతున్న ఈ వాదనలు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో కూకట్పల్లి కోర్టు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది.

సమంత తన గురించి దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ మీద పరువు నష్టం దావా వేసి వాళ్లు తన గురించి మాట్లాడకుండా చూడాలని అందు కోసం ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరింది. డబ్బు అవసరం లేదు కానీ పరువు నష్టం కలిగిస్తున్నారని కాబట్టి కఠినంగా వ్యవహరించాలని కోరగా దానికి క్షమాపణ కోరితే సరిపోతుంది పరువు నష్టం దావా అక్కర్లేదని కోర్టు చెప్పింది. ఇక తాజాగా కోర్టు వెల్లడించిన ఉత్తర్వుల ప్రకారం సమంత గురించి ఆ మూడు ఛానల్స్ లో పెట్టిన అభ్యంతరకర కంటెంట్ అంతా తొలగించాల్సి ఉంటుంది. అలాగే ఇక మీదట సమంత కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కూడా కోర్టు కోరింది. ఒక్కసారి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత అది పబ్లిక్ అయిపోతుంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరడం కుదరదని కూడా చెప్పింది. అయితే చాలా మంది సెలబ్రెటీలు మీద సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ పెరుగుతూ ఉంటుంది, రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మొట్టమొదటిసారి సమంత ఇలా కోర్టుకెక్కి తన హక్కులను సాధించుకుందని చెప్పవచ్చు.. సెలబ్రిటీ అయితేనేమి ఆమె కూడా మనిషే కదా, ఆమెకు కూడా మనసు ఉంటుంది కదా.