iDreamPost
android-app
ios-app

అవినీతి నాయకుడిని అరెస్టు చేస్తే గగ్గోలెందుకు..?: నాటి పాపం ఊరికే పోదు: నాగబాబు సంచలన వ్యాఖ్యలు

అవినీతి నాయకుడిని అరెస్టు చేస్తే  గగ్గోలెందుకు..?: నాటి  పాపం ఊరికే పోదు: నాగబాబు సంచలన వ్యాఖ్యలు

టిడిపి మాజీ మంత్రి, అసెంబ్లీలో టిడిపి ఉపనేత కె.అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందుకు ఎసిబి ఆధారాలతో ఆయనను అరెస్టు చేశారు. దీనిపై టిడిపి దాని అనుకూల మీడియా గగ్గోలు‌పెడుతుంది. ఒక అవినీతి పరుడును అరెస్టు చేస్తే దానికి కులం, ప్రాంతాన్ని పులుముతూ రెచ్చగొడుతున్నారు.

అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో టిడిపి ఒంటరి అయింది. బిజెపి, తదితర పార్టీలు అరెస్టును స్వాగతిస్తున్నాయి. అయితే జనసేన మీన మేషాలు లెక్కిస్తున్నా…ఆ పార్టీ‌ సీనియర్ నేత, జనసేన అధినేత అన్నయ్య, గత ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసిన నాగబాబు మాత్రం టిడిపి, దాని అనుకూల మీడియాపై మండిపడుతున్నారు. అవినీతి పరుడును అరెస్టు చేస్తే అంత గగ్గోలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. నాడు చంద్రబాబు పాలనలో జనసేన కార్యకర్తలను అరెస్టు చేసి గొడ్లను బాదినట్లు బాది…దొంగ కేసులు పెట్టిన పాపం ఊరికే పోదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనసేన నేత నాగబాబు ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. “టిడిపి హయాంలో టిడిపి నాయకురాలిని సోషల్ మీడియాలో ఏదో అన్నారని మా జనసేన కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టి… అరెస్ట్ చేసి…వాళ్ళని గొడ్లని బాది నట్లు బాది…అంత హింస పెట్టిన టిడిపి ఇప్పడు నానాయాగీ చేస్తున్నారు. ఇప్పుడు టిడిపి నాయకుడి మీద స్కాం జరిగిందని పోలీస్ అరెస్ట్ చేస్తే టిడిపి, దాని అనుకూల మీడియా అంత గగ్గోలు పెడుతుంది. వాళ్ళు ఆఫ్ట్రాల్ కార్యకర్తలు.. నాయకులు కారు అనేగా అప్పట్లో మీ ఉద్దేశ్యం.? మా జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసి కొట్టించిన పాపం టిడిపికి అంత తేలిగ్గా పోతుందా..?” అంటూ టిడిపి, దాని అనుకూల ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

“టిడిపి జెండాని, అజెండాని మోస్తున్న కొన్ని తెలుగు వార్త చానెల్స్ ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. టిడిపి పార్టీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని, టిడిపి పట్ల వాళ్లకున్న అనురాగం, మన వాడు చంద్రబాబు నాయుడు గారు అన్న అభిమానం, మన చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం” చేసేందుకు ఆయా ఛానల్స్ పని‌చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.

“చంద్రబాబుకి ఉపయోగపడినంత కాలం…ఓడ మల్లయ్య అని..బాబుగారి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ…బాబుగారి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ…బాబుగారికి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు వావ్ ఇవి అసలైన వార్తా ఛానల్స్” అంటూ వ్యంగ్యాస్త్రాలను వదిలారు. ఈ టిడిపి అనూకూల పత్రికల స్పిరిట్ అంటే..శభాష్…ఒక్కోసారి జగమ్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అని అనిపిస్తుందని అంటూ పేర్కొన్నారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişMeritkingcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetcasibomMadridbetHoliganbet Giriş