iDreamPost
android-app
ios-app

సెలవు తీసుకున్న వైల్డ్ డాగ్ – పూర్తి చేసిన నాగ్

  • Published Nov 06, 2020 | 7:44 AM Updated Updated Nov 06, 2020 | 7:44 AM
సెలవు తీసుకున్న వైల్డ్ డాగ్ – పూర్తి చేసిన నాగ్

సీనియర్ అగ్ర హీరోల్లో మొదటగా షూటింగ్ రీ స్టార్ట్ చేసిన కింగ్ అక్కినేని నాగార్జున ఫస్ట్ పూర్తి చేసిన ఘనతను కూడా తనే అందుకున్నాడు. కులుమనాలిలో నిర్విరామంగా జరిగిన షెడ్యూల్ లో తన వంతు భాగాన్ని పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన స్టిల్స్ ని పోస్ట్ చేస్తూ యూనిట్ ని వదిలిపోతున్నందుకు చాలా బాధగా ఉందని, హిమాలయాల అందాలను వదిలి దిగులుతో ఇంటికి చేరుకుంటున్నానని అందులో పేర్కొన్నారు. గత రెండు వారాలుగా అక్కడే ఉన్న నాగ్ బిగ్ బాస్ కోసం ఆ మధ్య ఛార్టర్డ్ ఫ్లైట్ లో వచ్చి టాస్క్ పూర్తి చేసిన సంగతి తెలిసింది. ఇకపై ఎలాంటి బ్రేకులు లేకుండా తనే కంటిన్యూ చేయబోతున్నాడు.

అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్న వైల్డ్ డాగ్ మీద అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. రా ఆఫీసర్ గా నాగార్జున నటిస్తున్న ఈ మూవీలో సయామీ ఖేర్, అలీ రజా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక్క పాట కూడా లేకుండా నాగ్ నటిస్తున్న సినిమాగా ఇదే మొదటిది. యాంటీ టెర్రరిజంను ఆధారంగా చేసుకుని చాలా రీసెర్చ్ చేసి మరీ సాల్మోన్ ఈ కథను రాసుకున్నారు. నాగార్జునకు ఇది హిట్ కావడం చాలా అవసరం. మన్మథుడు 2 గురించి కంటెంట్ విషయంలో చాలా విమర్శలు రావడంతో రొమాంటిక్ డ్రామాలకు బ్రేక్ ఇచ్చి ఈసారి పూర్తిగా యాక్షన్ వైపు మొగ్గు చూపాడు.

వైల్డ్ డాగ్ ఎప్పుడు విడుదలవుతున్నది ఇంకా నిర్ణయించలేదు. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తయ్యాక అప్పుడు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. థియేటర్లు ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. జనవరిలో చూస్తే విపరీతమైన పోటీ ఉంది. నాగ్ వారసుల సినిమాలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లవ్ స్టోరీలు రేస్ లో ఉన్నాయి. ఇవి కాకుండా క్రాక్, రెడ్, అరణ్యతో పాటు వకీల్ సాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే వైల్డ్ డాగ్ మార్చి కంటే ముందే వచ్చే అవకాశాలు తక్కువే. ఒకవేళ ఓటిటి ఆలోచన ఏదైనా ఉందేమో ఇప్పటికైతే ఎలాంటి క్లూ లేదు. క్లారిటీ కోసం అభిమానులు ఇంకొంత ఎదురు చూడక తప్పదు