Idream media
Idream media
రైతు భరోసాపై టీడీపీ, జనసేన పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వ్యవసాయ మిషన్ వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులందరికీ రైతు భరోసా, దరఖాస్తుకు నెలరోజుల సమయం ఉందని, రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. ఏ పథకానికి బడ్జెట్ కేటాయించినా కేంద్రం నిధులు కలుపుకుంటారని, రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే భరోసా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పలేదని ఆయన అన్నారు. టీడీపీ ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదని, జగన్ పారదర్శకత పాలన చూసి ఓర్వలేకపోతున్నారని నాగిరెడ్డి మండిపడ్డారు.