నందికొట్కూరు నియోజక వర్గ వైసీపీ నాయకుడు ముడియాల శ్రీనివాస రెడ్డి సహా ముగ్గురు మృతి .
గత సాయంత్రం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ సభ్యురాలిగా ఎన్నికైన శ్రీనివాసరెడ్డి భార్య లక్ష్మీదేవి .
కర్నూలు జిల్లా మద్దూరు గ్రామానికి చెందిన ముడియాల శ్రీనివాస రెడ్డి , తన మిత్రుడు సాక్షి విలేఖరి సుధాకర్ గౌడ్ , తన వద్ద పని చేసే లింగం అనే వ్యక్తితో కలిసి బెంగళూరుకు పోయి తిరిగి వస్తుండగా ప్యాపిలి మండలం కల్చట్ల బ్రిడ్జి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు టైర్ పేలిపోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుండి బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయ్యి వాహనంలో ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు .
మృతుడు ముడియాల శ్రీనివాస రెడ్డి పాములపాడు మండల స్థాయిలో వైసీపీలో క్రియాశీల నాయకుడు మాత్రమే కాక 2019 ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్థర్ విజయంలో కీలక పాత్ర పోషించారు . ఇటీవల పలు కార్పొరేషన్ల పదవుల భర్తీలో భాగంగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ సభ్యురాలిగా శ్రీనివాస రెడ్డి భార్య ఎంపికయ్యారు . భార్యకు పదవి వచ్చిన ఆనందం అనుభవించకుండానే , ప్రమాణ శ్వీకారానికి ముందే దుర్మరణం చెందడంతో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనయ్యారు . పార్టీ విజయం కోసం తమ దంపతుల కృషికి తగ్గ గుర్తింపు లభించిందని సంతోష పడ్డ ఆ కుటుంబంలో వెనువెంటనే ఆనందం స్థానే తీవ్ర విషాదం చోటుచేసుకోవడం బాధాకరం .
Also Read : ఏపీలో మరో పదవుల పండగ.. కార్పొరేషన్ల డైరెక్టర్ల నియామకం