MS Dhoni 41st Birthday : ఒక క్రికెటర్ 41 ఏళ్ల తర్వాత కూడా యాక్టీవ్ గా ఆడటం అంటే గొప్ప విశేషమే. అందులోనూ యేడాదికేడాది క్రేజ్ పెంచుకోవడమే నిజంగా గ్రేట్. అందుకే, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 41వ పుట్టిన రోజు విషెస్ తో ట్విట్టర్ దడదడలాడుతోంది. బిసిసిఐ విసెస్ తెలిపింది. స్టార్ ఆటగాళ్లు, మూవీ స్టార్స్ తో మిస్టర్ కూల్‌కి విషెస్ చెప్పారు.
An idol & an inspiration 👏 👏
Here's wishing @msdhoni – former #TeamIndia Captain & one of the finest to have ever graced the game – a very happy birthday. 🎂 👍 pic.twitter.com/uxfEoPU4P9
— BCCI (@BCCI) July 7, 2022
పొడవాటి జుట్టుతో ఆడే ఈ రాంచీ కుర్రాడు, ఇండియాకే మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్స్ లో ఒకడిగా ఎదిగాడు. ఓడినా, గెల్చినా, ఫైనల్స్ లో ఓడినా, కప్పు కొట్టినా… అదే కూల్.
2004లో జట్టులోకి వచ్చిన ధోని, ఇండియా కెప్టెన్ అయి, ఏకంగా 2007లో టి20 వోల్డ్ కప్ కొట్టేశాడు. 2011లో వన్డే వోల్డ్ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్ షిన్ ను సాధించాడు. టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ కి తీసుకెళ్లి, ఐసీసీ గదను కూడా భుజానవేసుకున్నాడు. అన్ని ఐసీసీ ట్రోఫీలు గెల్చిన ఒకే ఒక్క కెప్టెన్ ధోనీయే.
ధోని- సాక్షి దంపతుల వివాహ వార్షికోత్సవం జూలై 4. సెలబ్రేషన్స్ కోసం ఈ జంట లండన్ వెళ్లింది. అక్కడే ధోని పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేసింది సతీమణి సాక్షి.
ధోని కేక్ కటింగ్ వీడియోను షేర్ చేసిన సాక్షి.. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మై లవ్’’ అంటూ క్యాప్షన్ రాశారు. ఈ సెలబ్రేషన్స్ లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా ఫోటోలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. వచ్చే సీజన్లోనూ సీఎస్కే తరఫున బరిలోకి దిగుతున్నాడు.