iDreamPost
android-app
ios-app

MP Raghuramaraju – Pattabhiram : కొట్టలేదంటున్న పట్టాభి.. కొట్టారంటున్న రఘురామకృష్ణంరాజు.. ఏది నిజం..?

MP Raghuramaraju – Pattabhiram : కొట్టలేదంటున్న పట్టాభి.. కొట్టారంటున్న రఘురామకృష్ణంరాజు.. ఏది నిజం..?

టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీని, ఆ పార్టీ అధినేతను విమర్శిస్తూ తనను గెలిపించిన జనాన్ని ఏనాడో మరచిపోయిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీ నేత పట్టాభిని కొట్టారని కొత్త పిట్ట కధ ఒకటి చెప్పారు. కస్టడీలో టీడీపీ నేత పట్టాభిని కొట్టారని.. పట్టాభిని కొట్టారన్న దానిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి తనను పోలీసులు కొట్టలేదని టీడీపీ నేత పట్టాభి ప్రకటించారు. జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారని కేసులు నమోదు అవడంతో బుధవారం అర్ధరాత్రి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు, అయితే అరెస్ట్ అవుతానని తెలిసే ఒక వేళ పోలీసులు కొడితే.. ఆ విషయం అందరికీ తెలియజేసేందుకు ముందుగా తన శరీరం ఎలా ఉందో చూపించేందుకు దుస్తులు విప్పి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఇప్పుడు తన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. అరెస్ట్‌ అయిన తర్వాత ఏమైనా గాయాలు ఉంటే.. అవి పోలీసులు కొట్టడం వల్ల వచ్చినవని చెప్పేందుకు పట్టాభి ఆ వీడియో తీశారు.

ఇక వైద్య పరీక్షల అనంతరం పట్టాభిని కోర్టులో ప్రవేశ పెట్టగా ఆ సమయంలో తనను కొట్టలేదని అన్నారు. అయితే అప్పుడు కొట్టలేదు కానీ ఆయనని మచిలీపట్నం జైలుకు తీసుకెళ్లినప్పుడు కొట్టారని రఘురామక్రిష్ణంరాజు ఆరోపించారు. కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని కోర్టు నుంచి జైలుకు తరలిస్తూ ఆ మధ్యలో ఇలా చేయడం తప్పన్న ఆయన పోలీసులు అంటే తనకు గౌరవం ఉంది కానీ కొందరి వల్ల పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందన్నారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే నన్ను కొట్టలేదురా బాబు అని పట్టాభి చెబుతుంటే, కాదు కొట్టారని రఘురామక్రిష్ణంరాజు అంటుంటే ఏం చెప్పాలి. ఒకవేళ నిజంగానే కొట్టి ఉంటే అంత వ్యవహారం జరిగాక ఇప్పటిదాకా పట్టాభి నోరు విప్పకుండా ఉంటాడా? ప్రభుత్వం మీద ఎలా రాళ్ళు వేద్దామా అని ఆలోచించే పట్టాభి ఇప్పటిదాకా ఊరుకుంటారా?. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన పట్టాభి తర్వాత హనుమాన్ జంక్షన్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

తర్వాత ఆయన విజయవాడలో ఇంటికి మాత్రం చేరలేదు. ఆ తర్వాత ఆయన ఫ్లైట్‌లో మాల్దీవులకు వెళ్లారంటూ కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ విషయం మీద ఒక వీడియో చేసిన పట్టాభి ఇక్కడికి పంపగా దాన్ని టీడీపీ ఆఫీస్ బ్యాక్ గ్రౌండ్ తో మ్యాచ్ చేసి వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోను టీడీపీ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసింది. నిజంగా కొట్టి ఉంటే ఆ వీడియోలో అయినా మాట్లాడే వారు కదా. పోలీసులు కొడితే పట్టాభి సైలెంట్ గా ఉంటారా? రఘురామక్రిష్ణంరాజు చెబుతున్నట్టు నాయకులను కొట్టడం అంత ఈజీనా? ఏవో దొంగతనాలు, చిన్నా చితకా కేసులో దొరికిన వాళ్ళ మీద పోలీసులు చేయి చేసుకున్నారు అంటే నమ్మచ్చు కానీ, ఎంపీ, ఎమ్మెల్యే, రాష్ట్ర స్థాయి నాయకులను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా? రఘురామ తనను కొట్టారన్న కేసులో కూడా గుంటూరు హాస్పిటల్ లో లేని దెబ్బలు వేరే హాస్పిటల్ కి వెళ్ళే లోపు ఎలా వచ్చాయో? ఆయనే చెప్పాలి. ఈ విషయంలో మాత్రం రఘురామక్రిష్ణంరాజు మాట్లాడిన మాటలకు జనం నవ్వుకుంటున్నారు అని చెప్పక తప్పదు.

Also Read : TDP Pattabhi – పట్టాభి భయపడినట్లు ఏమీ జరగలేదు..!