iDreamPost
android-app
ios-app

Salman Khan : గాడ్ ఫాదర్ కోసం కండల వీరుడు రెడీ

  • Published Mar 11, 2022 | 3:37 PM Updated Updated Dec 22, 2023 | 6:33 PM

ఒరిజినల్ వెర్షన్ లో పృథ్విరాజ్ చేసిన క్యారెక్టర్ అది. ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చి కీలకమైన మలుపులకు కారణమవుతుంది. మంచి మాస్ ఎలివేషన్లు ఉంటాయి ఆ ఎపిసోడ్ లో. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సల్మాన్ చిరులు జంటగా నటించే షెడ్యూల్ ని రేపటి నుంచి మొదలుపెట్టబోతున్నారు.

ఒరిజినల్ వెర్షన్ లో పృథ్విరాజ్ చేసిన క్యారెక్టర్ అది. ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చి కీలకమైన మలుపులకు కారణమవుతుంది. మంచి మాస్ ఎలివేషన్లు ఉంటాయి ఆ ఎపిసోడ్ లో. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సల్మాన్ చిరులు జంటగా నటించే షెడ్యూల్ ని రేపటి నుంచి మొదలుపెట్టబోతున్నారు.

  • Published Mar 11, 2022 | 3:37 PMUpdated Dec 22, 2023 | 6:33 PM
Salman Khan : గాడ్ ఫాదర్ కోసం కండల వీరుడు రెడీ

మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్విరాజ్ చేసిన క్యారెక్టర్ అది. ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చి కీలకమైన మలుపులకు కారణమవుతుంది. మంచి మాస్ ఎలివేషన్లు ఉంటాయి ఆ ఎపిసోడ్ లో. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సల్మాన్ చిరులు జంటగా నటించే షెడ్యూల్ ని రేపటి నుంచి మొదలుపెట్టబోతున్నారు. కర్జాత్ లోని ఎన్డి స్టూడియోస్ లో దీనికి సంబంధించిన పార్ట్ ని వారం రోజులకు పైగా చిత్రీకరించబోతున్నారు. ఇప్పటికే చిరు అక్కడికి చేరుకున్నట్టు సమాచారం.

ఇది జరుగుతున్నంత కాలం చిరంజీవి సల్మాన్ ఖాన్ ఫార్మ్ హౌస్ పాన్వెల్ లో ఉంటారట. దేశంలోనే అత్యంత విలాసవంతమైన నివాసంగా దీని గురించి ముంబై మీడియాలో ప్రచారం ఉంది. చాలా తక్కువ సెలబ్రిటీలు ఇప్పటిదాకా దాన్ని సందర్శించారు. తనకు హైదరాబాద్ వచ్చినప్పుడంతా గొప్ప ఆతిథ్యం ఇచ్చే మెగాస్టార్ కు తాను హోస్ట్ గా మారాల్సి రావడంతో సల్మాన్ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నాడట. నిజానికి ఈ షూట్ జనవరిలోనే జరగాల్సింది. కానీ చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో కొంత కాలం బ్రేక్ పడింది.ఈలోగా  కండల వీరుడు టైగర్ 3 తాలూకు పనుల్లో బిజీ అయిపోయి మెగాస్టార్ కోసం ఇప్పుడు డేట్లు ఇచ్చాడు.

భారీ అంచనాలతో రూపొందుతున్న గాడ్ ఫాదర్ ని దసరా కానుకగా ఈ ఏడాది రిలీజ్ చేయాలనే ప్లానింగ్ జరుగుతోంది. నయనతార కీలక పాత్రలో నటిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో సత్యదేవ్ ఓ ముఖ్యపాత్రను దక్కించుకున్నాడు. తమన్ సంగీతం మరో ఆకర్షణ. అసలు వెర్షన్ కి కీలకమైన మార్పులు చేసి తెలుగు ఆడియన్స్ టేస్ట్ కి తగట్టు ప్రెజెంట్ చేయబోతున్నారట. చాలా గ్యాప్ తర్వాత చిరు రాజకీయ నేపధ్యం ఉన్న చిత్రం చేస్తున్నారు. ఆచార్య ఏప్రిల్ 29న రానున్న నేపథ్యంలో ఈ ఏడాది మెగా ఫాన్స్ కు రెండు చిరు సినిమాలు రాబోతున్నాయి. మూడోది భోళా శంకర్ కూడా వేగంగానే జరుగుతోంది కానీ 2023 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు

Also Read : Fan Wars : మేమంతా ఒకటే అన్న హీరోల మాటలు వినరా

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio