iDreamPost
android-app
ios-app

RRR : ఉత్తరాది రాష్ట్రాల మీద రాజమౌళి ఫోకస్

  • Published Mar 21, 2022 | 12:09 PM Updated Updated Mar 21, 2022 | 12:09 PM
RRR : ఉత్తరాది రాష్ట్రాల మీద రాజమౌళి ఫోకస్

నిన్న ఢిల్లీలో జరిగిన ఆర్ఆర్ఆర్ ఈవెంట్ కు అమీర్ ఖాన్ ముఖ్యఅతిథిగా రావడం దాని మైలేజ్ ని నార్త్ సర్కిల్స్ లో అమాంతం పెంచేసింది. కార్యక్రమం మొత్తం సరదాగా సాగిపోవడం, జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో కలిసి అమీర్ కూడా నాటు నాటు పాటకు చిన్నగా ఒక స్టెప్పు వేయడం ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయిపోయింది. రాజమౌళి అమీర్ ఖాన్లు పరస్పరం పొగడ్తల వర్షంలో తడిసి ముద్దయ్యారు. తారక్ చరణ్ లు సరదాగా జోకులు వేసుకోవడం, జక్కన్నతో కలిసి గిల్లుకోవడం లాంటి చిలిపి పనులు చేసి మంచి ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పరిచారు. బాహబలిని ఇండియా బిగ్గెస్ట్ హిట్ గా అమీర్ ఖాన్ వర్ణించడం హై లైట్ అయ్యింది.

అలియా భట్ వీళ్ళకు జత కావడం గ్లామర్ ని జోడించింది. అందరూ కలిసి నాటు నాటు పాటకు అలా స్టెప్పు వేయడంతో ఫ్యాన్స్ విజిల్స్ తో గ్రౌండ్ హోరెత్తిపోయింది. అయితే రాజమౌళి ఇలా ప్లాన్ చేయడం ఇది మొదటిసారి కాదు. జనవరిలో రిలీజ్ అనుకున్నప్పుడు బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి సల్మాన్ ఖాన్ తో ప్రమోట్ చేయించారు. ఆయనా డాన్స్ చేసి సూపర్ అనిపించారు. ఒక్క షారుఖ్ ఖాన్ ను కూడా తీసుకొస్తే బ్యాలన్స్ అయిపోతుంది కానీ పఠాన్ షూటింగ్ లో బిజీగా ఉన్న బాద్షా దీనికి రాలేడు. మొత్తానికి బాలీవుడ్ ముగ్గురు టాప్ హీరోలలో ఇద్దరిని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగం చేయడం ద్వారా జక్కన్న తన రేంజ్ ఏంటో చెప్పేశారు.

నార్త్ ఆడియన్స్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్వింగ్ లో ఉన్నాయి. సల్మాన్ అమీర్ లు పర్సనల్ గా ఆర్ఆర్ఆర్ గురించి చెప్పడం ఖచ్చితంగా ప్లస్ అయ్యేదే. ఈసారి రాజమౌళి అక్కడి మార్కెట్ మీద చాలా సీరియస్ ఫోకస్ పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో పబ్లిసిటీ చేయకపోయినా ఇద్దరు హీరోల అభిమానులు ఆ బాధ్యతను తీసుకుంటారు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో అది సాధ్యం కాదు. అందుకే దగ్గరుండి మరీ హీరోలను తీసుకుని గంటల వ్యవథిలో దేశమంతా చుట్టేసి వస్తున్నారు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు కలెక్షన్ల సునామి విరుచుకుపడటం ఖాయం. ఇంకో అయిదు రోజుల్లో తేలిపోతుందిగా. చూద్దాం

Also Read : Star Kids : హీరోల వారసులంటే అబ్బాయిలే కాదు