iDreamPost
android-app
ios-app

Jr NTR : ఆసక్తి రేపుతున్న తారక్ లైనప్

  • Published Mar 30, 2022 | 2:53 PM Updated Updated Apr 01, 2022 | 3:03 PM
  • Published Mar 30, 2022 | 2:53 PMUpdated Apr 01, 2022 | 3:03 PM
Jr NTR : ఆసక్తి రేపుతున్న తారక్ లైనప్

నాలుగేళ్ల నిరీక్షణకు ఫలితంగా అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ జూన్ నుంచి కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభం కాబోయే సినిమా తాలూకు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే చాలా లేట్ కావడంతో అభిమానులు త్వరగా మొదలుపెట్టామని ఒత్తిడి చేస్తున్నారు. ఆచార్య రిలీజ్ అయితే తప్ప కొరటాల ఫ్రీ కాలేరు. ఇప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ గ్యాప్ ఇవ్వడం ఎందుకని పక్కా ప్లానింగ్ తో మూడు నెలల తర్వాత స్కెచ్ వేశారు. దీని తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఏప్రిల్ రెండో వారంలో ఓపెనింగ్ జరగొచ్చని ఫిలిం నగర్ టాక్.

ఇవి కాకుండా కెజిఎఫ్ సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక ప్యాన్ ఇండియా మూవీ ఉంది తారక్ కు. ఇది ఎప్పుడు చేస్తారనేది ఖచ్చితంగా చెప్పలేం. ఇద్దరి కమిట్ మెంట్ల మీద ఒక క్లారిటీ వచ్చాక కానీ కంక్లూజన్ కు రాలేం. వీటి సంగతలా ఉంచితే అనిల్ రావిపూడి తారక్ కోసం ఒక మంచి లైన్ సిద్ధం చేశారని సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో రూపొందేలా ఒక ప్రతిపాదన యంగ్ టైగర్ వద్దకు వెళ్లిందట. వినగానే నచ్చిన జూనియర్ ఫుల్ వెర్షన్ అయ్యాక నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు వినికిడి. అనిల్ రావిపూడి ఎఫ్3 రిలీజ్ అయ్యాక బాలకృష్ణ సినిమా పనుల్లో బిజీ అవుతాడు. అది పూర్తి చేశాక అప్పటికి తారక్ అందుబాటుని బట్టి ప్లాన్ చేసుకోవాలి.

వాడుకోవాలే కానీ తారక్ లో కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అదుర్స్ లో చూశాంగా. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే తన ప్రతి సినిమాలోనూ నవ్వించే ప్రయత్నంలో ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. అలాంటిది హాస్యాన్నే ఎక్కువగా నమ్ముకునే అనిల్ రావిపూడి చేతిలో పడితే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. ఈ రెండు నెలల తర్వాత ఇకపై గ్యాప్ లేకుండా వరసగా సినిమాలు చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ లాగా మరీ విపరీత జాప్యం కాకుండా ఏదైనా సరే ఆరు నెలలలోపే పూర్తయ్యేలాగా తన దర్శకులకు చెబుతున్నాడట. ఈ సంవత్సరం మాత్రం ఆర్ఆర్ఆర్ తో సర్దుకోవాల్సిందే. ఇంకోటి వచ్చే ఛాన్స్ లేదు

Also Read : Salman Khan : కండల వీరుడి మాటల్లో చాలా అర్థం ఉంది

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet