iDreamPost
iDreamPost
ప్రభాస్ ఇమేజ్ ప్యాన్ ఇండియా లెవెల్ లో ఎంత పెరిగినా ఇప్పుడో బాహుబలి రేంజ్ బ్లాక్ బస్టర్ ఒకటి పడాలి. సాహో, రాధే శ్యామ్ లు ఒకదాన్ని మించి మరొకటి నిరాశపరచడంతో అభిమానుల ఆశలన్నీ సలార్ మీదే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రెండో లుక్ కోసమే డార్లింగ్ బరువు తగ్గి స్లిమ్ అయ్యాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిన్న ఆది పురుష్ దర్శకుడు ఓం రౌత్ ఇంటికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చిన ఫోటోలో ప్రభాస్ ని చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. అంత తగ్గాడు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం డార్లింగ్ రెండు పాత్రలు చేయడం నిజమే కానీ అవి ఒకే ఫ్రేమ్ లో కనిపించే క్యారెక్టర్సా లేక ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కథలో ఇంకో పాత్ర ఉంటుందా అనే క్లారిటీ లేదు. మొత్తానికి ఇది కిక్కిచ్చే న్యూసే. ఇప్పటిదాకా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయలేదు. బాహుబలిలో ఉంది కానీ కథ ప్రకారం తండ్రి ముందే చనిపోతారు కాబట్టి ఇద్దరూ కలవరు. కానీ సలార్ లో అలా కాదట. అది నాన్నా కొడుకా లేక అన్నదమ్ములా లేక రౌడీ అల్లుడు తరహాలో ఏ సంబంధం లేని ఒకే పోలికతో ఉన్న రెండు పాత్రలా అనేది తెలియాల్సి ఉంది. హీరోయిన్ శృతి హాసన్ ఒకటే కాబట్టి కథ ఎలా ఉండబోతోందో గెస్ చేయడం ఒకింత కష్టమే.
ప్రస్తుతం మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న మరో ముఖ్యమైన విషయం విడుదల తేదీలు. అది పురుష్ ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. 2023 సంక్రాంతికి రిలీజ్ చేయడం మీద ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. సలార్ ఈ ఏడాది చివరిలోగా పూర్తవ్వొచ్చు. మధ్యలో మారుతీ దర్శకత్వంలో తక్కువ కాల్ షీట్లతో మరో చిత్రం ఉంటుంది. ప్రాజెక్ట్ కె విషయంలో తొందరపడటం లేదు. ఇప్పటికి ఇంట్రో మాత్రమే షూట్ చేశారు. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో ఓ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఓకే అయినట్టే. వచ్చే ఏడాది వేసవిలో మొదలుపెట్టొచ్చు. సో ఏది పక్కాగా ముందు వస్తుంది తర్వాత వస్తుందనేది ఆయా నిర్మాతలే చెప్పలేకపోతున్నారు కాబట్టి వెయిట్ అండ్ సీ