iDreamPost
android-app
ios-app

Ghani : జాగ్రత్తగా సెట్ చేసుకున్న వరుణ్ తేజ్

  • Published Mar 02, 2022 | 4:10 PM Updated Updated Mar 02, 2022 | 4:10 PM
  • Published Mar 02, 2022 | 4:10 PMUpdated Mar 02, 2022 | 4:10 PM
Ghani : జాగ్రత్తగా సెట్ చేసుకున్న వరుణ్ తేజ్

ఇప్పటికే రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన వరుణ్ తేజ్ గని కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఏప్రిల్ 8న థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే ఆర్ఆర్ఆర్ వచ్చిన సరిగ్గా రెండు వారాలకు ప్లాన్ చేసుకున్నారన్న మాట. ఇది మంచి నిర్ణయం. ఎందుకంటే ట్రిపులార్ మీద ఉన్న హైప్ కి  ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనక కనీసం రెండు వారాల పాటు జనం దీనివైపే పరుగులు పెడతారు. ఆ తాకిడిలో ఇంకేది వచ్చినా ఇబ్బంది పడటం ఖాయం. గని బడ్జెట్ పరంగానూ హెవీ రిటర్న్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికైనా సేఫ్ గేమ్ ఆడాలి.

అలా అని రిస్క్ లేదని కాదు. ఆ పై వారమే ఏప్రిల్ 14న కెజిఎఫ్ 2 వస్తోంది. ఎలాంటి పోస్ట్ పోన్ కు అవకాశమే లేదని నిర్మాతలు నిన్న మరోసారి తేల్చి చెప్పారు. గనికి ఒకవేళ ముప్పు ఏదైనా ఉంటే అది రాఖీ భాయ్ నుంచి మాత్రమే. అప్పటికి ఫస్ట్ వీక్ రన్ పూర్తయి ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు. గని ఒకవేళ అదే నెల మూడో వారం రావాలనుకున్నా పెదనాన్న అన్నయ్యలు కలిసి నటించిన ఆచార్య ఏప్రిల్ 29కి సిద్ధంగా ఉంది. సో అన్ని కోణాల్లో చర్చించి గనికి సంబంధించి బెస్ట్ డెసిషన్ తీసుకున్నారు. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం కూడా ఏప్రిల్ 8కి వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం.

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన గని ద్వారా అల్లు అర్జున్ అన్నయ్య బాబీ నిర్మాతగా తొలి ప్రాజెక్ట్ ని టేకప్ చేశారు. గీత ఆర్ట్స్ సమర్పణ అండ్ సపోర్ట్ ఎలాగూ ఉన్నాయి. ఉపేంద్ర చాలా గ్యాప్ తర్వాత ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. సునీల్ శెట్టి, జగపతిబాబు లాంటి క్యాస్టింగ్ గట్టిగానే ఉంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. భీభత్సమైన ఫామ్ లో ఉన్న తమన్ సంగీతం మీద అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గద్దలకొండ గణేష్ తర్వాత బాగా గ్యాప్ వచ్చేసిన వరుణ్ తేజ్ గని తర్వాత ఇంకో యాభై రోజుల్లోనే ఎఫ్3 తో పలకరించనున్నాడు

Also Read : Sree Leela : ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో కొత్త హీరో ఎంట్రీ

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişberlinbet girişgrandpashabet