iDreamPost
android-app
ios-app

Bheemla Nayak : ఈవెంట్ సక్సెస్ చేశారు – ఇక సినిమాదే బాధ్యత

  • Published Feb 24, 2022 | 2:02 PM Updated Updated Dec 15, 2023 | 5:26 PM

మినిస్టర్లు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్ప ప్రత్యేకంగా ఇండస్ట్రీ నుంచి అతిథులంటూ ఎవరూ రాలేదు. స్పీచులు, పాటలు, పెర్ఫార్మన్స్ లు ఇవన్నీ మాములే కానీ వేడుకలో కొత్తగా మరో ట్రైలర్ ని ఆవిష్కరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మినిస్టర్లు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్ప ప్రత్యేకంగా ఇండస్ట్రీ నుంచి అతిథులంటూ ఎవరూ రాలేదు. స్పీచులు, పాటలు, పెర్ఫార్మన్స్ లు ఇవన్నీ మాములే కానీ వేడుకలో కొత్తగా మరో ట్రైలర్ ని ఆవిష్కరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Bheemla Nayak : ఈవెంట్ సక్సెస్ చేశారు – ఇక సినిమాదే బాధ్యత

నిన్న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వాస్తవానికి ఇది రెండు రోజుల క్రితమే ప్లాన్ చేసినప్పటికీ ఏపి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో వాయిదా వేశారు. మినిస్టర్లు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్ప ప్రత్యేకంగా ఇండస్ట్రీ నుంచి అతిథులంటూ ఎవరూ రాలేదు. స్పీచులు, పాటలు, పెర్ఫార్మన్స్ లు ఇవన్నీ మాములే కానీ వేడుకలో కొత్తగా మరో ట్రైలర్ ని ఆవిష్కరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టేచర్ ఉన్న హీరోకి ఇంత తక్కువ గ్యాప్ లో ఇంకో కట్ ఇవ్వడమనేది చాలా అరుదుగా జరిగే వ్యవహారం. అందులోనూ ఇంత హైప్ ఉన్న సినిమాకు జరగదు.

దీని వెనుక కారణం మొన్న వచ్చిన ట్రైలర్ కు సోషల్ మీడియాలో ఎక్కువగా నెగటివ్ రెస్పాన్స్ రావడమే. ఎడిటింగ్ సరిగా జరగకపోవడం, వీడియోలో అరుచుకునే సన్నివేశాలు తప్ప ఆసక్తి కలిగించే అంశాలు పెద్దగా లేకపోవడం నిరాశపరిచాయి. ఇది తెలుసుకున్న త్రివిక్రమ్ బృందం వెంటనే అలెర్ట్ అయ్యింది. ఎన్నడూ లేనిది తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద కూడా కామెంట్స్ రావడంతో అప్పటికప్పుడు ఇంకో కట్ సిద్ధం చేయించింది. ఫలితంగా ఈ కొత్త ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో అభిమానులు హమ్మయ్యా అనుకుంటున్నారు. ఇదేదో ముందే ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మొత్తానికి పాస్ అయ్యింది.

రేపు రిలీజ్ కాబోతున్న భీమ్లా నాయక్ కి బుకింగ్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. తెలంగాణలో తెల్లవారుఝామున 4 గంటల నుంచే ప్రీమియర్ షోలు స్టార్ట్ కాబోతున్నాయి. హైదరాబాద్ లో దాదాపు 95 శాతం పైగా అడ్వాన్ బుకింగ్ పూర్తి కావడం విశేషం. ఏపిలో పరిమిత షోలు, సాధారణ టికెట్ రేట్ల వల్ల రెవిన్యూ ఏమైనా తగ్గొచ్చేమో కానీ అక్కడా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. గత కొన్ని వారాలుగా సరైన స్టార్ హీరో సినిమా లేని లోటు భీమ్లా నాయక్ ఏ స్థాయిలో తీరుస్తాడోనని ట్రేడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మొదటి రోజు రికార్డులు ఖాయమే కానీ ఆ నెంబర్లు ఎలా ఉండబోతున్నాయన్నది కీలకం. చూద్దాం ఏం జరగనుందో.

Also Read : RC15 : చరణ్ 15లో చాలా స్పెషల్స్ ఉన్నాయే