iDreamPost
android-app
ios-app

Anushka Shetty కామ్రేడ్ రాములక్కగా అనుష్క ?

  • Published Apr 26, 2022 | 12:44 PM Updated Updated Apr 26, 2022 | 12:44 PM
Anushka Shetty కామ్రేడ్ రాములక్కగా అనుష్క ?

బాహుబలి, భాగమతి తర్వాత బొత్తిగా సినిమాల్లో కనిపించడం మానేసిన అనుష్క మధ్యలో నిశ్శబ్దం చేసింది కానీ దాని ఫలితం తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. సైరా నరసింహారెడ్డిలో కొన్ని నిముషాలు కనిపించి ఊరట కలిగించింది. ఇంక మళ్ళీ దర్శనమే లేదు. అభిమానులు ఎంతగా డిమాండ్ చేస్తున్నా పలకని స్వీటీ ఇటీవలే నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న మూవీలో చేయడానికి ఒప్పుకుంది. దాని అఫీషియల్ డీటెయిల్స్ ఇంకా పూర్తిగా బయటికి రాలేదు కానీ కథల ఎంపికలో మాత్రం చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్న మాట వాస్తవం. ఇక తన ఫ్యాన్స్ కో గుడ్ న్యూస్ ఇప్పుడు లీకుల రూపంలో ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఆచార్యలో అనుష్క కామ్రేడ్ రాములక్కగా కనిపించబోతున్నట్టు సమాచారం. సెకండ్ హాఫ్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని సీన్లలో తన క్యారెక్టర్ ని స్పెషల్ గా డిజైన్ చేశారట దర్శకుడు కొరటాల శివ. సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నారు కానీ తీరా ఇప్పుడిది లీకైపోయింది. అనఫీషియల్ కాబట్టి ఖచ్చితంగా చెప్పలేం కానీ నిప్పు లేనిదే పొగరాదుగా. అనుష్క చిరు సినిమాల్లో ఇలా తళుక్కున మెరవడం ఇది మొదటిసారి కాదు. స్టాలిన్ లో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. సైరాలో హీరో పాత్రను పరిచయం చేసే సన్నివేశాల్లో కనిపించింది. కాకపోతే ఫుల్ లెన్త్ రోల్ మాత్రం సాధ్యపడలేదు.

నిజానికి కాజల్ అగర్వాల్ స్థానంలో అనుష్కని రీ ప్లేస్ చేశారనే మరో ప్రచారం జరుగుతోంది కానీ అది నిజం కాదు. సో అనుష్క ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆచార్య ఫస్ట్ డేకి వెళ్తారన్న మాట. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్ఫర్మ్ కాగానే ప్రిన్స్ అభిమానులు రెడీ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు తోడయ్యారు. మొత్తానికి స్లో పాయిజన్ లాగా ఆచార్య ఫీవర్ మెల్లగా పెరుగుతోంది. అంచనాలు మరీ ఆర్ఆర్ఆర్ రేంజ్ లో లేవు కానీ కొరటాల అన్ని సినిమాల్లాగే ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. మరి ఈ కామ్రేడ్ రాములక్క టాక్ నిజమో కాదో ఇంకో మూడు రోజుల్లో తెలిసిపోతుంది. లెట్ వెయిట్ అండ్ సి

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş