iDreamPost
android-app
ios-app

Anirudh : తమిళ సంగీత దర్శకుడికి భలే ఆఫర్స్

  • Published Mar 24, 2022 | 8:06 PM Updated Updated Mar 24, 2022 | 8:06 PM
Anirudh : తమిళ సంగీత దర్శకుడికి భలే ఆఫర్స్

కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ కు తెలుగులో ఆఫర్లు వచ్చాయి కానీ ఎందుకో ఇక్కడ అంత బలమైన ముద్ర వేయలేకపోయాడు. ముఖ్యంగా అతను సంగీతం అందించిన సినిమాలు ఏవీ బ్లాక్ బస్టర్స్ కాకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. జెర్సీకి పేరు వచ్చినా ఆ క్రెడిట్ నాని పెర్ఫార్మన్స్ కింద నలిగిపోయింది. గ్యాంగ్ లీడర్ రెండు పాటలు హిట్ అయినా మూవీ రిజల్ట్ దెబ్బ కొట్టింది. ఇక పవర్ స్టార్ అభిమానులు పీడకలగా చెప్పుకునే అజ్ఞాతవాసి గురించి చెప్పడానికి ఏమి లేదు. ఇలా బ్యాడ్ ట్రాక్ రికార్డు అనిరుద్ టాలీవుడ్ కెరీర్ ని నెమ్మది చేస్తూ వచ్చింది. అఫ్కోర్స్ తను మాతృభాషలోనే విపరీతమైన బిజీ లెండి.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం అనిరుద్ కి రెండు క్రేజీ తెలుగు ప్రాజెక్టులు వచ్చినట్టు సమాచారం. అందులో ఒకటి రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ స్క్రిప్ట్ తో పాటు ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జెర్సీ టైంలో గౌతమ్ కి అనిరుద్ కి కుదిరిన సింక్ వల్ల ఇది సాధ్యమయ్యిందని అనుకోవచ్చు. రెండోది విజయ్ దేవరకొండ సమంతా కాంబోలో శివ నిర్వాణ డైరెక్ట్ చేయబోయే మూవీ. ఇది అఫీషియల్ అయినట్టే. చరణ్ ది ప్రకటించడానికి ఇంకా టైం పడుతుంది. ఈ రెండు ఆల్బమ్స్ ని కనక అనిరుద్ చార్ట్ బస్టర్ చేయగలిగితే ఇక్కడా అవకాశాలు క్యూ కడతాయి.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో రెహమాన్ తర్వాత ఆ స్థాయిలో అనిరుద్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. పాటలు కూడా యూత్ కి ఓ రేంజ్ లో ఎక్కేసేలా ఉంటాయి. కానీ ఇక్కడే సరైన బ్రేక్ రాలేదు. ఒకప్పుడు ఏఆర్ రెహమాన్, హారిస్ జైరాజ్ లాంటి వాళ్ళు ఎంత పెద్ద హీరోలకు పని చేసినా ఆశించిన ఫలితాలు దక్కలేదు. తమిళంలో ఇచ్చిన స్థాయిలో ఇక్కడి వాటికి సంగీతం ఇవ్వలేకపోవడం మైనస్ అయ్యేది. ఇళయరాజా, ఎస్ఏ రాజ్ కుమార్ లు మాత్రమే ఈ నెగటివ్ సెంటిమెంట్ ని దాటారు. మరి అనిరుద్ రవిచందర్ వీళ్ళతో జత కట్టే ఛాన్స్ ఇప్పటికి వచ్చింది. చరణ్ విజయ్ దేవరకొండ ఇద్దరికీ సూపర్ ఆల్బమ్స్ ఇస్తే దశ తిరిగినట్టే

Also Read : RRR & KGF Chapter 2 : కొత్త పోకడకు దారి తీస్తున్న ఫ్యాన్ వార్స్