iDreamPost
android-app
ios-app

ఎదురుచూపుల్లో ఎన్ని చిత్రాలో

  • Published Mar 31, 2021 | 8:38 AM Updated Updated Mar 31, 2021 | 8:38 AM
ఎదురుచూపుల్లో ఎన్ని చిత్రాలో

టాలీవుడ్ లో సినిమాల జోరు మాములుగా లేదు. లాక్ డౌన్ తర్వాత రిలీజులు ఊపందుకున్న పరిశ్రమ మనదొక్కటే. తమిళం కన్నడలోనూ ఇంత దూకుడు లేని మాట వాస్తవం. ఇప్పటికీ అక్కడ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఇక్కడేమో వకీల్ సాబ్ తో మొదలుపెట్టి ఆర్ఆర్ఆర్ దాకా ప్రతి వారం కనీసం రెండు మూడు కొత్త చిత్రాలు థియేటర్లలో వచ్చేలా ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయింది. డేట్లు కూడా ఇచ్చేశారు. అలా అని ఇంకేమి పెండింగ్ లేవు అనుకోవడానికి లేదు. షూటింగ్ పూర్తయిపోయి ఎప్పుడెప్పుడు వద్దామా అని ఎదురు చూస్తున్నవి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. వీటి ప్రమోషన్లు కూడా అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి.

సుశాంత్ నటించిన ‘ఇచట వాహనాలు నిలుపరాదు’ టీజర్ అయితే వచ్చింది కానీ అంతకు మించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఓ మోస్తరు అంచనాలైతే ఉన్నాయి. మెగాస్టార్ చిన్నల్లుడు రెండు సినిమాలు ‘సూపర్ మచ్చి’ ఊసే లేకపోగా ‘కిన్నెరసాని’ కూడా కంప్లీషన్ కు దగ్గరలో ఉంది. ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ ఇటీవలే పబ్లిసిటీ మొదలుపెట్టింది. గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేశారు. కమెడియన్ సత్య హీరోగా డెబ్యూ చేసిన ‘వివాహ భోజనంబు’ సైలెంట్ గానే ఉంది. కిరణ్ అబ్బవరం ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ బిజినెస్ జరుగుతోంది కానీ డేట్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇతనిదే ‘సెబాస్టియన్’ అనే మరో మూవీ కూడా రెడీ అయ్యింది.

సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో రూపొందిన ఎంటర్ టైనర్ ‘కోతి కొమ్మచ్చి’ దాదాపు ఫస్ట్ కాపీ సిద్ధమైన దశలో ఉలుకుపలుకు లేకుండా ఆగిపోయారు. చిన్నపిల్లల్ని ప్రధాన పాత్రలో శేఖర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందించిన ‘హౌస్ అరెస్ట్’ తేదీ డిసైడ్ కాలేదు. శ్రీవిష్ణు ‘రాజరాజ చోర’ది కూడా ఇదే సిచువేషన్. నాగశౌర్య ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ కూడా లాక్ కాలేదు. ఇవన్నీ మీడియం బడ్జెట్ లో రూపొందిన చెప్పుకోదగ్గ కంటెంట్ ఉన్న సినిమాలే. కాకపోతే విపరీతమైన పోటీ నేపథ్యంలో ఎప్పుడు రావాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. మరో ఎక్కడ గ్యాప్ వస్తుందో చూసి థియేటర్లలోకి ఎప్పుడు వస్తాయో చూడాలి మరి