iDreamPost
android-app
ios-app

బ్రహ్మచారి మాట వినని మనసు

  • Published Mar 02, 2020 | 6:12 AM Updated Updated Mar 02, 2020 | 6:12 AM
బ్రహ్మచారి మాట వినని మనసు

అప్పుడెప్పుడో నాగార్జున క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ గుర్తే. ఇప్పటి తరానికి కూడా అది ఇన్స్ టాంట్ గా కనెక్ట్ అయ్యే ఎవర్ గ్రీన్ మెలోడీ. ఎవరైనా సరే మనసు మీద పాట పాడమంటే ముందు గుర్తొచ్చేది ఇదే. అంతగా దీని మేజిక్ తాలూకు ప్రభావం ఇప్పటికీ పని చేస్తూనే ఉంది. అందుకే ఈసారి ఆయన వారసుడు అఖిల్ కోసం సంగీత దర్శకుడు గోపి సుందర్ అలాంటి ప్రయత్నమే చేశాడు. త్వరలో విడుదల కాబోతున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లోని మొదటి పాటను ఇందాకా లిరికల్ వీడియో రూపంలో రిలీజ్ చేశారు.

మనసా మనసా మనసారా బ్రతిమాలా అంటూ సాగే పల్లవితో హీరో తన మనసును ప్రియురాలి వెంట పడొద్దంటూ బ్రతిమాలే తరహాలో సురేంద్ర కృష్ణ రాసిన సాహిత్యం చక్కగా సింక్ అయ్యింది. మరీ పదాల మాయాజాలం అని చెప్పలేకపోయినా సింపుల్ ప్రాసలతో ఈజీగా పాడుకునేలా ఉంది. ఇక ట్రెండ్ సెట్టర్ గా ఉన్న సిద్ శ్రీరామ్ కు మరో హిట్ ట్రాక్ పడినట్టే అని చెప్పొచ్చు. మెల్లగా స్లో పాయిజన్ లాగా ఇది యూత్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. కొన్ని చోట్ల వేగంగా పాడేసి హడావిడి పడినట్టు అనిపించినా మొత్తానికి సిద్ శ్రీరామ్ స్టైల్ లోనే సాగిందీ పాట.

ఇదే కాంబినేషన్ లో గతంలో వచ్చిన ఇంకేం కావాలేతో పోల్చే ఛాన్స్ లేదు కానీ డీసెంట్ గానే ఉంది. లిరికల్ వీడియోలో రివీల్ చేసిన అఖిల్, పూజా హెగ్డేల లుక్స్ బాగున్నాయి. గోపి సుందర్ ట్యూన్ తన పద్ధతిలోనే సాగింది. మెలోడీతో మొదలైన మోస్ట్ ఎలిజిబుల్ ప్రయాణం మరో మంచి ఆడియో రాబోతుందనే హామీ అయితే ఇచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మే 22 విడుదల చేసే విధంగా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది

Song Link Here @ bit.ly/2Tsw8y5

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Giriş