Idream media
Idream media
59 చైనా యాప్‌లను నిషేధించి చైనాకు షాకిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా మరో ఝలక్ ఇచ్చారు. చైనా సోషల్ మీడియా వీబోను మోడీ వదిలిపెట్టారు. వీబో అకౌంట్‌లో గతంలో పెట్టిన ప్రొఫైల్ ఫొటోతో పాటు పూర్తి వివరాలను, కామెంట్లను, పోస్టులను, ఫొటోలను తొలగించారు. ప్రస్తుతం ఈ పేజీ పూర్తి బ్లాంక్‌గా కనపడుతోంది.
2015లో ప్రధాని వైబోలో అకౌంట్ తెరిచారు. ప్రధానిగా చైనాలో పర్యటించే ముందు మోడీ ఈ ఖాతా తెరిచారు. వైబోలో మోడీకి 2,44,000 మంది ఫాలోయర్లున్నారు. వీరిలో ఎక్కువ మంది చైనీయులే. చైనా భాషలోనే మోడీ ఈ ఖాతా నడిపారు.
జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. చైనాతో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఓ వైపు యత్నిస్తూనే మిగతా విషయాల్లోనూ మోడీ సర్కారు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా పెద్ద సంఖ్యలో బలగాలను మోహరిస్తుండటంతో భారత్ కూడా సైన్యాన్ని తరలించింది. భారత విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది. అయితే మరోవైపు ఇండియా, చైనా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.