iDreamPost
android-app
ios-app

ప్రధాని మోది విదేశీ ప్రయాణ ఖర్చు ఏంతంటే …

ప్రధాని మోది విదేశీ ప్రయాణ ఖర్చు ఏంతంటే …

మూడేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ విదేశీ ప్రయాణ ఖర్చు దాదాపు రూ.255 కోట్లని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2016-19 మధ్య కాలంలో ప్రధాని మోదీ విదేశీ ప్రయాణాలకు ఉపయోగించిన చార్టర్ విమానాలకు కోసం రూ.255 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి మురళీధరన్ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా తెలిపారు. 2016-17 సంవత్సరంలో రూ.76.27 కోట్లు, 2017-18లో రూ.99.32 కోట్లు, 2018-19 సంవత్సరంలో రూ. 79.91 కోట్లు ఖర్చయినట్లు ఆయన వివరించారు.
2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటించారు. అంతకు ముందు ఏ ప్రధాని పర్యటించని దేశాలకు వెళ్లి చరిత్ర సృష్టించారు. విదేశీ సంభందాలు, వాణిజ్యం, సైనిక సహకారం తదితరాలపై స్వయంగా ప్రధాని మోదీ దృష్టి పెట్టారు. మోదీ విదేశాలతో నెరిపిన సంబంధాల వల్లే ఇటీవల కశ్మిర్ వ్యవహారంలో పాకిస్థాన్ ఏకాకిని చేసింది. దాదాపు అన్ని దేశాలు భారత్ కు మద్దతుగా నిలిచాయి.