iDreamPost
android-app
ios-app

అది మోదీ హుందాతనం.. మా తండ్రి పవార్ గొప్పతనం – సుప్రియ

అది మోదీ హుందాతనం.. మా తండ్రి పవార్ గొప్పతనం – సుప్రియ

మోదీ నాకు రాష్ట్రపతి పదవి ఇస్తాననలేదు కానీ నాకూతురు సుప్రియాకు కేబినెట్ లో అవకాశం ఇస్తానన్నారని ఎన్సీపి అధినేత శరద్ పవార్ ఒక మరాఠి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పటం ఇప్పుడువైరల్ అవుతుంది.

ప్రధాని మోదీ శరద్ పవార్ తో కలసి పనిచేద్దాం.. అనడం మోదీ ఉదారతనం హుందాతనమని, దానిని తిరస్కరించడం శరద్ పవార్ గొప్పతనమని సుప్రియా సూలే అన్నారు. అది ఇద్దరు పెద్దవాళ్ల మధ్య జరిగిన సమావేశం.. దానిలో నేను లేను. సిద్దాంతపరమైన విబేధాలు ఉన్నప్పటికి మహారాష్ట్రలో వ్యక్తిగత సంబంధాలు చాలా ముఖ్యమైనవన్నారు. ప్రధాని మోదీ మహారాష్ట్రలో కలసి పనిచేద్దామని అన్నప్పటికి కలసి పనిచేయడం కుదరని పవార్ వినయంగా తిరస్కరించిన విషయం సుప్రియ గుర్తుచేశారు. అజిత్ పవార్ నాకు అన్న, తను బీజేపీ కి సపోర్ట్ చేసినపుడు కుటుంబసభ్యులు అంతా బాధపడ్డారు, మళ్లీ తప్పు తెలుసుకుని తనే వచ్చాడు. కుటుంబం అన్నాక భేదాలు సహజమన్నారు. అదొక పీడ కలగా ఆమె అభివర్ణించారు.

శివసేన నాయకుడు ఉద్దవ్ ఠాక్రే మంచి ఆలోచనపరుడని కితాబిచ్చారు సుప్రియ. బాల్ ఠాక్రే చనిపోయినపుడు ఉద్దవ్ థాక్రే పై ఎవ్వరికి నమ్మకం లేదని శివసేన పార్టీ పతనం అవుతుందని అనుకున్నారు కానీ ఇప్పుడు తను మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయ్యారని సుప్రియా సూలే తెలిపారు. ఎన్సీపి అధినేత మా నాన్న మాత్రమే కాదు మా నాయకుడు అని ఆమె స్పష్టం చేశారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి సమర్దవంతమైన పాలన అందిస్తోందని సుప్రియా ఆశాభావం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ ఎన్సీపికి వ్యతిరేకంగా బీజేపీకి సపోర్ట్ చేసినపుడు తిరిగి అతను సొంత గూటికి చేరడంలో శరద్ పవార్ భార్యతో పాటు, సుప్రీయ సూలే కూడా కీలకంగా మారారు. వీరి సంప్రదింపుల వల్లే అజిత్ తిరిగి సొంత గూటికి చేరారు.