iDreamPost
android-app
ios-app

‘రాజధాని లో భూసేకరణ చట్టాన్ని రద్దు చేయండి’

‘రాజధాని లో భూసేకరణ చట్టాన్ని రద్దు చేయండి’

గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇచ్చిన బలవంతపు భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం వైఎస్‌ జగన్‌కు లేఖ రాశారు. రైతులకు ఇష్టం లేకపోయినా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం ఆనాడు టీడీపీ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేసిందని లేఖలో పేర్కొన్నారు. భూసేకరణకు ఒప్పుకోని రైతులపై కేసులు పెట్టడమే కాకుండా.. వారి పంటలను తగుటబెట్టించారని ఆర్కే ఆరోపించారు. ఏడాదికి మూడు నుంచి ఐదు పంటలు పండే భూములను అన్యాయంగా తీసుకున్నారని విమర్శించారు.