వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద సొంత ఆటోలు కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం ఇవ్వడంపై జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సీఎం జగన్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నల్లవంతెన సెంటర్ ఆటోస్టాండ్ వద్ద ది సెంట్రల్ డెల్డా ఆటో వర్కర్స్ యూనియన్‌కు చెందిన డ్రైవర్లు కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు. ఆటో కార్మికుల సమస్యలను పాదయాత్రలో జగన్ తెలుసుకున్నారని, అధికారంలోకి రాగానే వారికి ఆర్థిక సాయం అందజేశారని రాపాక కొనియాడారు.