iDreamPost
iDreamPost
టీడీపీ లో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పంచాయతీ ముగిసింది. ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు తో గోరంట్ల భేటీ ముగిసింది. దాదాపు 45నిమిషాల పాటు గోరంట్ల తో ముఖాముఖి సమావేశం జరిగింది. సమావేశ తీరు పట్ల బుచ్చయ్య సంతృప్తి వ్యక్తంచేశారు. దాంతో 20 రోజులుగా టీడీపీ లో సాగుతున్న దుమారం టీ కప్పులో ముగిసినట్టేనని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చంద్రబాబు కు చెప్పానని బుచ్చయ్య మీడియాతో అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరగాలన్నదే నా ఉద్దేశం అని తెలిపారు. పార్టీలో లోటుపాట్లు సరిచేసుకోవాలని సూచించినట్టు తెలిపారు. పార్టీ బాగు కోసం నా రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నానని వివరించారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం తెలుగుదేశం లోనే ఉంటానని ప్రకటించారు.
దాంతో బుచ్చయ్య చౌదరి తీరు మరోసారి ఆశ్చర్యంగా మారింది. ఇప్పటికే పలుమార్లు కోపగించడం, అంతలోనే చల్లబడడం ఆయనకి అలవాటుగా మారింది.
చంద్రబాబు వస్తే తప్ప తగ్గేదే లేఅన్నట్టుగా మాట్లాడిన ఆయన చివరకు తానే బాబు దగ్గరకి వచ్చి రాజీ కి సిద్ధపడడం విశేషం. పదే పదే అదే తీరున వ్యవహరిస్తున్న మూలంగానే బుచ్చయ్య ని బాబు లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి రాజమండ్రి రాజకీయాల్లో అదిరెడ్డి అప్పారావు కుటుంబంతో ఉన్న విభేదాల మూలంగానే బుచ్చయ్య అలకపునిన విషయం బహిరంగ రహస్యమే. అయినా బాబు నుంచి హామీ వచ్చిందా లేదా అనేది కూడా సందేహంగా మారింది