నిమ్స్‌లో క్యాన్సర్ రోగులకోసం రూ. 18 కోట్లతో ఎంఈఐఎల్ నిర్మించిన క్యాన్సర్ విభాగాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్ సంస్థ అత్యాధునిక సౌకర్యాలతో ఆంకాలజీ వార్డును ఏర్పాటు చేయడం గమనార్హం.
క్యాన్సర్ పేషెంట్‌ల కోసం 50 పడకలతో కూడిన ప్రత్యేక వార్డు, లుకెమియా రోగుల కోసం,పిల్లల క్యాన్సర్ వార్డులను ఏర్పాటు చేయడంతో పాటు, నర్సింగ్ స్టేషన్లు.. మహిళలు, పురుషులు, చిన్న పిల్లలకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఎఆర్)లో భాగంగా నిమ్స్‌లో ఎంఈఐఎల్ ఈ సేవలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ క్యాన్సర్ రోగుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో నిమ్స్ లో ఆంకాలజీ వార్డును ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. నిరుపేద క్యాన్సర్ రోగులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అత్యాధునిక టెక్నాలజీని వాడి క్యాన్సర్ వార్డును ఏర్పాటు చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో మేఘా ఇంజినీరింగ్ సంస్థ చైర్మన్ పిచ్చిరెడ్డి, డైరెక్టర్ సుధారెడ్డి హాజరయ్యారు