iDreamPost
android-app
ios-app

బీచ్‌లో బట్టల్లేకుండా పరుగులు తీసిన బాలీవుడ్ నటుడు

బీచ్‌లో బట్టల్లేకుండా పరుగులు తీసిన బాలీవుడ్ నటుడు

ప్రముఖ బాలీవుడ్ నటుడు మిలింద్‌ సోమన్‌ తన 55వ ఏట అడుగుపెట్టారు. 55 సంవత్సరాల వయసు వచ్చినా సరే తాను ఎంత ఫిట్‌గా ఉన్నాడో ప్రపంచానికి తెలియజేయాలని మిలింద్ సోమన్ నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఉదయంపూట బీచ్‌లో పరుగులు తీస్తూ తాను పరుగులు తీస్తున్న ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు.

అయితే ఇందులో ఒక మెలిక ఉంది. కండలు తిరిగిన దేహాన్ని చూపడం మిలింద్ సోమన్ రొటీన్ అనుకున్నాడేమో ఒంటిపై నూలు పోగన్నది లేకుండా బీచ్ వెంట పరుగులు తీయడమే కాకుండా నగ్నంగా పరుగెత్తిన ఫోటోలను సామాజికమాధ్యమాల ద్వారా షేర్ చేసాడు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మిలింద్ సోమన్ భార్య అంకిత కోన్వర్‌ ఈ ఫోటోలను కెమెరాలో బంధించిందని ఆయన వెల్లడించారు.

కాగా సామాజిక మాధ్యమాల్లో మిలింద్ సోమన్ కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయన అభిమానులు ఆయన ఫిట్‌నెస్‌ చూసి ఆనందపడుతున్నారు. పనిలో పనిగా కొంతమంది మాత్రం ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి వినోదాన్ని పంచే పనిలో పడ్డారు. ఏది ఏమైనా మిలింద్ సోమన్ చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.