iDreamPost
android-app
ios-app

మెగలో మేనియా – అన్నీ “నేనే” బిహేవియర్

  • Published Apr 15, 2020 | 5:39 AM Updated Updated Apr 15, 2020 | 5:39 AM
మెగలో మేనియా –  అన్నీ  “నేనే”  బిహేవియర్

ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా అది నా వలనే జరిగింది అనే భ్రాంతి , ఎవరు ఏమి కనిపెట్టినా , సాధించినా దాని వెనకున్నది తానేనని , అందుకు స్ఫూర్తి , సహకారాలు తనవే అని భ్రమ పడే అరుదైన వ్యాధిని సైకాలజీ పరిభాషలో మెగలో మేనియా అని పిలుస్తారు .
రెండ్రోజుల క్రితం ప్రధానితో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ రెడ్ ,గ్రీన్ , ఆరెంజ్ జోన్ల వారీగా లాక్ డౌన్ నిబంధనలు సడలించే విషయమై చర్చించగా ఈ రోజు ప్రధాని ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్ సూచనలకు అనుగుణంగా భావి కార్యాచరణ వెల్లడించారు .

వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన బాబు తాను పదవ తారీఖునే ప్రధానికి లేఖ రాశానని , నిన్న పోన్ కాల్ అపాయింట్మెంట్ అడిగి ఈ రోజు రెండు నిమిషాలు మాట్లాడి సలహాలు ఇచ్చానని చెప్పుకొచ్చారు .

ఎవరికి ఏ విషయం పై లేఖ రాసినా వెంటనే ప్రెస్ కి రిలీజ్ చేసే బాబు ఈ లేఖ ఎందుకు విడుదల చేయలేదు , అసలు లాక్ డౌన్ లో లేఖ ఎలా పంపుతారు ? . సరే ఈ రోజుల్లో లేఖలు ఎక్కడివి మెయిల్ పంపారు అనుకొంటే ఈ రోజైనా సదరు పదవ తారీఖునే పంపిన మెయిల్ డేట్ తో సహా ప్రెస్ కి ఎందుకివ్వలేదు .

ప్రధానితో మాట్లాడాలి అని నిన్న అడిగి ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నరకి ఫోన్లో మాట్లాడిన వ్యక్తి , వెంటనే ప్రధాని ప్రెస్ మీట్ కన్నా ముందే మాట్లాడిన విషయం చెప్పి జోన్ల గురించి చర్చిన విషయం ఊదరగొట్టి ముందే క్రెడిట్ పొందే ప్రయత్నం చేయకుండా మధ్యాహ్నం ఒంటిగంటా పదిహేను నిమిషాల వరకూ ఎందుకు చెప్పలేదు . మాములుగా పొరుగు రాష్ట్రం నుండి ఓ ఎమ్మెల్యే స్థాయి నాయకుడు బాబుకి కాల్ చేసినా సెకన్లలో స్పందించి ఫ్లాష్ ప్లాష్ న్యూస్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న బాబు అంటూ స్క్రోలింగ్ , పెద్ద రెడ్ హెడ్డింగ్ లతో హోరెత్తించే చానళ్లు మధ్యాహ్నం వరకూ ఎందుకు కవరేజ్ ఇవ్వలేదు .

దీన్ని బట్టి చూస్తే ప్రధానికి లేఖ , ఫోన్ కాల్ ఎంతవరకూ వాస్తవమో కానీ గ్రీన్ , రెడ్ , ఆరెంజ్ జోన్ల గురించి చర్చించే ఆస్కారం లేదని , అసలు రెండు నిమిషాల్లో ఈ జోన్ల గురించి వివరించడం కష్టసాధ్యమని ఇదంతా బాబు గారు ఉద్దేశ్యపూర్వకంగా ప్రధానితో మాట్లాడాను అన్న క్రెడిట్ కోసం చేస్తున్న డ్రామా అని కొందరు రాజకీయ నేతలు అంటున్నారు . కానీ ఇలా మరొకరి ఘనతను తనది అని చెప్పుకోవడం ఒక రకమైన మానసిక వ్యాధి . వైద్య పరిభాషలో ఈ జబ్బుని మెగలో మేనియా అంటారు . ఇందుకు ఉదాహరణగా గతంలో జరిగిన అనేక ఘటనలు బాబు గారు తన ఖాతాలో వేసుకున్న ఉదంతాల్ని కొన్నటిని చూద్దాం .

బేగంపేట ఎయిర్పోర్ట్ తానే నిర్మించానని చెప్పడం , టీడీపీ పార్టీ బ్రిటిష్ వారితో పోరాడిన పార్టీగా చెప్పడం, అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా ప్రతిపాదించింది , ఆయనకి విజన్ 2020 పుస్తకం రాయమని చెప్పింది తానేనని చెప్పడం , ప్రకృతిని హేండిల్ చేశానని , ఉష్ణోగ్రతలు తగ్గించానని చెప్పుకోవడం , తాను ప్రధాని పదవి వద్దన్నానని , కాబోయే ప్రధాని తానేనని పలుమార్లు పరస్పర విరుద్ధంగా చెప్పడం , సెల్ ఫోన్స్ ,కంప్యూటర్ , లాప్టాప్ లు దేశంలోకి తానే తెచ్చానని చెప్పుకోవడం , లండన్ వెళ్తే కోహినూర్ వజ్రం , భారత దేశం నుండి దోచుకొన్న ఇతర విలువైన ఆస్తులు తిరిగి అడుగుతానని బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారని చెప్పడం , హైదరాబాద్ అభివృద్ధి తన కష్టార్జితమని ,తాను ప్రపంచపటంలో పెట్టానని చెప్పడం , పెట్టుబడుల కోసం స్నానం చేయకుండా తిరిగానని , తాను తప్ప మరెవరూ ఈ రాష్ట్రాన్ని , దేశాన్ని పాలించలేరని నమ్మి ప్రచారం చేసుకోవడం , అంబేద్కర్ గారికి భారత రత్న ఇప్పించానని చెప్పుకోవడం . సముద్రాన్ని కంట్రోల్ చేశానని, నీళ్ళని నిలబెట్టానని , భూగర్భంలో క్యూసెక్కుల లెక్కన దాచానని చెప్పడం లాంటివి నిశితంగా గమనించాల్సిన సమస్యలు.

ఇలా ఇతరులు సాధించిన ఘన విజయాలు తన ఖాతాలో వేసుకోవడం , అసాధ్యాలని తాను చేశానని భ్రమ పడటం తీవ్రమైన మానసిక వ్యాది . దాని పేరు మెగలో మానియా . అయితే ఈ వ్యాధి ఆరంభంలో నయం చేయడం సులభం , కానీ బాబు గారికి దాదాపు పది పదిహేనేళ్లుగా ఉన్నట్టు కనపడుతుంది కానీ చుట్టూ ఉన్నవారు గుర్తించకుండా లేక గుర్తించినా తమ ప్రయోజనాల కోసం ఆహా ఓహో అని ఇంకా వ్యాధి ముదిరి ఫైనల్ స్టేజ్ వరకూ తీసుకొచ్చారు . ఇప్పటికైనా బాబు గారి పక్కనున్న వారు ఆయన మానసిక వ్యాధి గుర్తించి అనుభవుఁజ్ఞులైన సైకాలజిస్ట్ లను కలిసి ట్రీట్మెంట్ తీసుకొంటే ఈ ఫైనల్ స్టేజ్ లో పూర్తిగా తగ్గకపోయినా పరిస్థితి కొంతవరకూ అదుపులోకి వస్తుంది .