iDreamPost
android-app
ios-app

18 ఏళ్ళ తర్వాత మెగా ఫ్యాక్షన్ టైటిల్ ?

  • Published Dec 05, 2020 | 6:27 AM Updated Updated Dec 05, 2020 | 6:27 AM
18 ఏళ్ళ తర్వాత మెగా ఫ్యాక్షన్ టైటిల్ ?

అంతగా ఆ కథలో ఏం నచ్చిందో కానీ లూసిఫర్ రీమేక్ మీద మాత్రం మెగాస్టార్ చిరంజీవి వెనక్కు తగ్గడం లేదు. ముందు సుజిత్ అన్నారు. కొంత వర్క్ చేశాక మోయలేనని తప్పుకున్నాడు. తర్వాత వివి వినాయక్ వచ్చాడు. ఆకుల శివతో కలిసి ఓ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసినట్టుగా టాక్ వచ్చింది. అదీ వర్క్ అవుట్ కాలేదు. హరీష్ శంకర్ ను అడిగారు. దీని కన్నా పవర్ ఫుల్ కథతో స్ట్రెయిట్ సినిమా చేస్తాను కానీ ఇది వద్దని సున్నితంగా తప్పుకున్నట్టు వినికిడి. నెక్స్ట్ మోహన్ రాజా లైన్ లోకి వచ్చాడు. తమిళ్ లో రీమేక్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన మోహన్ రాజా తెలుగు డెబ్యూ హనుమాన్ జంక్షన్ కూడా మలయాళం నుంచి తెచ్చుకున్నదే. ఇది సూపర్ హిట్ అయ్యింది.

తాజా అప్ డేట్ ప్రకారం లూసిఫర్ కథను రాయలసీమ బ్యాక్ డ్రాప్ కు అనుగుణంగా మారుస్తున్నారట. అంతే కాదు టైటిల్ గా ‘బైరెడ్డి’ని ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని లీకైన సోర్స్ ని బట్టి తెలుస్తోంది. బైరెడ్డి పేరు వినడానికి చిన్నగా ఉన్నా చాలా పవర్ ఫుల్ సౌండింగ్ వస్తుంది. ఒకప్పుడు ఈ ట్రెండ్ టాలీవుడ్ ని రాజ్యమేలింది. సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, భరతసింహారెడ్డి, ఆదికేశవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వీరరాఘవరెడ్డి ఇలా హీరో పాత్రల పేర్లు, టైటిల్స్ లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్లు రెడ్డి నేపథ్యంలో కాసుల వర్షం కురిపించుకున్నాయి. ఒక దశలో ఇదంతా రొటీన్ అయ్యేసరికి మానుకున్నారు.

ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి ఇలాంటి టైటిల్ కి మొగ్గు చూపిస్తున్నారంటే ఆశ్చర్యమే. బైరెడ్డిగా మెగాస్టార్ పాత్ర చాలా డిఫరెంట్ షేడ్స్ లో సాగుతుందట. ఒరిజినల్ వెర్షన్ కు కట్టుబడి అవసరం లేని కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఇందులో మోహన్ రాజా ఇరికించేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. అందుకే బైరెడ్డిలో హీరో పాత్రకు హీరోయిన్ లేకపోయినా షాక్ అవ్వాల్సిన పని లేదని అంటున్నారు. అయితే ఇదంతా అధికారిక ప్రకటన వచ్చాకే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ఆచార్య పూర్తి చేశాక వేదాళం రీమేక్ కు వెళ్లి అటుపై ఈ లూసిఫర్ అలియాస్ బైరెడ్డి సంగతి చూడబోతున్నారు చిరు