iDreamPost
android-app
ios-app

సాయిపల్లవి కోసం మెగా మార్పు ?

  • Published Dec 23, 2020 | 7:41 AM Updated Updated Dec 23, 2020 | 7:41 AM
సాయిపల్లవి కోసం మెగా మార్పు ?

పవన్ కళ్యాణ్ రానా ఫస్ట్ టైం కాంబినేషన్ లో రూపొందుతున్న అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఆలోగా వకీల్ సాబ్ పూర్తయిపోయి ఉంటుంది కాబట్టి దీనికి పవన్ ఏకధాటిగా కాల్ షీట్స్ కేటాయించబోతున్నాడు. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయ్యిందట. అయితే హీరోయిన్లుగా ఎవరు నటిస్తారనే సస్పెన్స్ మాత్రం ఇంకా వీడలేదు. రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తుండగా పవన్ కు జంటగా ఫిదా పోరి సాయి పల్లవిని లాక్ చేయొచ్చనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అయితే ఇంకా అఫీషియల్ కాలేదు.

ఇన్ సైడ్ సోర్స్ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఒరిజినల్ వెర్షన్ లో లేని కొన్ని మార్పులు ఇందులో జోడిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా పవన్ చేయబోతున్న పోలీస్ క్యారెక్టర్ కు మలయాళంలో భార్య పాత్ర ఉంటుంది. విప్లవ భావాలతో అక్కడి ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది. అయితే ఎక్కువ స్పాన్ ఉండదు. సెకండ్ హాఫ్ లో పెద్దగా కనిపించదు కూడా. తెలుగులో ఇలాగే చేస్తే కష్టం. అందులోనూ సాయి పల్లవి చేసినప్పుడు కొన్ని అంచనాలు ఉంటాయి. ఏ మాత్రం తేడా అనిపించినా ప్రేక్షకులు తిరస్కరిస్తారు. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకునే సాయి పల్లవి క్యారెక్టర్ ని ప్రియురాలిగా మార్చారని తెలిసింది.

అయితే ఇదంతా అధికారిక ప్రకటన వచ్చాకే క్లారిటీ వస్తుంది. కేవలం అరవై రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే దీన్ని పూర్తి చేయబోతున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు బిల్లా రంగా టైటిల్ పరిశీలనలో ఉంది. ఇద్దరి ఈగోలతో నడిచే కథ కాబట్టి ఇంతకన్నా మంచి పేరు సెట్ కావడం అంత ఈజీ కాదు. అందులోనూ చిరంజీవి క్లాసిక్ టైటిల్ కనక ఫ్యాన్స్ కి కనెక్ట్ అవుతుంది. వకీల్ సాబ్ కనక వేసవిలో వస్తే బిల్లారంగాలు దసరా లేదా దీపావళికి రావొచ్చు. అంతకంటే పవన్ ఫ్యాన్స్ కు కావాల్సింది ఏముంటుంది. దీనికీ తమనే స్వరాలు సమకూరుస్తున్నారు.