iDreamPost
android-app
ios-app

Meenakshi Chaudhary : స్టార్ హీరోలకు జోడిగా వరుస ఆఫర్లు

  • Published Oct 23, 2021 | 9:54 AM Updated Updated Oct 23, 2021 | 9:54 AM
Meenakshi  Chaudhary : స్టార్ హీరోలకు జోడిగా వరుస ఆఫర్లు

ఇండస్ట్రీలో అంతే. టైం రావాలే కానీ ఊహించని విధంగా అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి. ఏ హీరోయిన్ కైనా గట్టి బ్రేక్ దక్కాలంటే పెద్ద హీరోలకు జోడిగా చేస్తేనే సాధ్యమవుతుంది. అందులోనూ కెరీర్ ప్రారంభంలోనే వస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరిని చూస్తుంటే అదే అనిపిస్తోంది. సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందబోయే భారీ చిత్రంలో మీనాక్షికి రెండో కథానాయికగా ఆఫర్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్. ఇప్పటికే స్క్రిప్ట్ ఒక కొలిక్కి తెచ్చిన మాటల మాంత్రికుడు డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.

ఇప్పటికే మీనాక్షికి ప్రభాస్ సలార్ లో ఛాన్స్ దక్కింది.శృతి హాసన్ తో పాటుగా డార్లింగ్ స్క్రీన్ ని షేర్ చేసుకోబోతోంది. ఇదింకా అధికారికంగా ప్రకటించలేదు. రవితేజ ఖిలాడీ ఆల్రెడీ పూర్తి చేసింది. అడవి శేష్ హీరోగా నాని నిర్మిస్తున్న హిట్ 2లో తనే హీరోయిన్. తమిళ్ లోనూ కొలై అనే సినిమా చేసింది. డెబ్యూ మూవీ ఇచట వాహనములు నిలుపరాదు ఫ్లాప్ అయినప్పటికి మీనాక్షికి టైం బాగుంది. ఒకవేళ మహేష్ ప్రభాస్ ప్రాజెక్టులు కనక ఓకే అయితే రాబోయే రోజుల్లో కెరీర్ ని బాగా సెట్ చేసుకోవచ్చు. అసలే హీరోయిన్ల కొరతతో అల్లాడిపోతున్న టాలీవుడ్ కు పూజా హెగ్డే రష్మిక మందన్న తప్ప పెద్దగా ఆప్షన్ల లేకుండా పోయాయి.

సాయి పల్లవి లాంటి వాళ్ళు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటంతో దర్శకులకు కాంబోలు సెట్ చేయడం పెద్ద ఇబ్బందిగా మారింది. తప్పని పరిస్థితుల్లో మార్కెట్ తగ్గిన పాత హీరోయిన్లను తీసుకోక తప్పడం లేదు. ఇక త్రివిక్రమ్ సినిమా సంగతి చూస్తే వచ్చే ఏడాది దసరా విడుదలను టార్గెట్ చేసుకుని షూటింగ్ చేస్తారట. తమన్ సంగీతం సంగీతం అందిస్తున్న ఈ ఎంటర్ టైనర్ మీద అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అతడు-ఖలేజా తర్వాత రిపీట్ అవుతున్న హీరో దర్శకుడు కాంబినేషన్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్ డేట్స్ రాబోతున్నాయో

Also Read : Varun Doctor – ఓటిటి వద్దనుకున్నారు – 100 కోట్లకు దగ్గరయ్యారు