iDreamPost
iDreamPost
మూడేళ్ల క్రితం వచ్చి నాని కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచిన ఎంసిఎ(మిడిల్ క్లాస్ అబ్బాయి)లో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి ఆ సినిమాకు ఎంత పెద్ద ప్లస్సయ్యిందో చూశాం. ఫిదాతో వచ్చిన ఇమేజ్ దానికి చాలా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఆ కాంబినేషన్ రిపీట్ కాబోతోందని ఫిలిం నగర్ టాక్. ట్యాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందబోయే శ్యామ్ సింగ రాయ్ లో సాయి పల్లవినే ఎంపిక చేసుకోబోతున్నట్టు సమాచారం. రెండు కోట్ల దాకా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర కావడంతో కేవలం గ్లామర్ తో నెట్టుకొచ్చే వాళ్ళతో చేయించలేమని గుర్తించి ఆ మేరకు తననే ఫైనల్ చేయొచ్చని వినికిడి.
అధికారిక ప్రకటన త్వరలో రావొచ్చు. ప్రస్తుతం సాయి పల్లవి లవ్ స్టోరీ, విరాట పర్వం బాలన్స్ పూర్తి చేసే పనిలో ఉంది. ఆ రెండు కంప్లీట్ అయితే కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వొచ్చు. నానితో నటించేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆలోచించాల్సిన పనిలేదు. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగే శ్యామ్ సింగ రాయ్ మీద నాని చాలా స్పెషల్ ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు. వి డిజాస్టర్ తో షాక్ లో ఉన్న నాని ఇకపై స్క్రిప్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. ముందు టక్ జగదీశ్ పూర్తి చేయాల్సి ఉంది. అది వచ్చే ఏప్రిల్ లోగా ఫినిష్ చేసి ఆపై కాస్త ఎక్కువ టైం శ్యామ్ సింగ రాయ్ కు ఇచ్చేలా ప్లానింగ్ జరుగుతోంది.
సాయి పల్లవితో కాంబో అంటే డబ్బింగ్ మార్కెట్ పరంగానూ హెల్ప్ అవుతుంది. సితార సంస్థ ఈ కారణంగానే బడ్జెట్ కు కొంత భారమైనా పారితోషికం విషయంలో రాజీ వద్దనుకున్నారట. అగ్రిమెంట్లు, కాల్ షీట్లు వగైరా చూసుకుని త్వరలో అనౌన్స్ మెంట్ ఇవ్వొచ్చు. ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంటుందని చెప్పారు కానీ పరిశీలనలో ఎవరున్నారో ఇంకా తెలియదు. లాక్ డౌన్ వల్ల షెడ్యూల్స్ అన్నీ తారుమారయ్యాయి కానీ లేకపోతే వితో పాటు ఈ రెండు సినిమాలు కూడా 2020లోనే వచ్చేవి. కానీ కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బ చిన్నది కాదుగా. వీటి తర్వాత నాని ఏ సినిమాలు చేస్తాడనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. రెండు మూడు కథలు విని ఓకే అన్నాడు కానీ ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే పూర్తి వివరాలు బయటికి వస్తాయి