iDreamPost
iDreamPost
టాక్ సంగతి ఎలా ఉన్నా సంక్రాంతి సీజన్ పుణ్యమాని ఈజీగా నష్టాల గండం గట్టెక్కేసిన విజయ్ మాస్టర్ ఇప్పటిదాకా పది కోట్లకు పైగా వసూళ్లు దాటించి సేఫ్ గేమ్ అనిపించుకుంది. పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరకడంతో ఈ ఫీట్ సాధ్యమయ్యింది. ఒకవేళ ఏదైనా అన్ సీజన్ లో మన స్టార్ హీరోలతో పొటీ పడి ఉంటే సిచువేషన్ ఖచ్చితంగా ఇంకోలా ఉండేది. దీని సంగతి అలా ఉంచితే మాస్టర్ డిజిటల్ ప్రీమియర్ కు డేట్ లాక్ అయినట్టు ఫ్రెష్ అప్ డేట్. హక్కులు చేజిక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ ఫిబ్రవరి 12న విడుదల చేసేందుకు ప్లానింగ్ లో ఉన్నట్టు ఓటిటి వర్గాల టాక్. వచ్చే నెల మొదటి వారంలో ప్రకటన రావొచ్చు.
ఇది ముందస్తుగానే జరిగిన ఒప్పందం ప్రకారమట. సినిమా ఆడినా నెల రోజుల నిడివితో స్ట్రీమింగ్ చేస్తామని ప్రైమ్ ముందుగానే అగ్రిమెంట్ చేసుకోవడంతో నిర్మాతలు ఇంకేం చేసినా లాభం లేదనేది ఇన్ సైడ్ న్యూస్. గతంలో రంగస్థలం తెలుగు రాష్ట్రాల థియేటర్లలో భీకరంగా ఆడుతున్న సమయంలోనే 45వ రోజున స్ట్రీమ్ చేసి ప్రైమ్ షాక్ ఇచ్చింది. పాలసీ మ్యాటర్స్ లో తను అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టే హక్కులు కొనుగోలు సమయంలోనే పిచ్చ క్లారిటీతో డేట్ల గురించి ప్రొడ్యూసర్ కు పక్కా సమాచారం ఇచ్చేస్తుంది. బాక్సాఫిస్ ఫలితాన్ని ముందే ఊహించలేక సరే అనే వాళ్లే ఎక్కువ.
ఇంకా ఇరవై రోజుల టైం ఉంది కాబట్టి మాస్టర్ అప్పటిదాకా తమిళనాడులోనూ అంత స్ట్రాంగ్ గా ఉండే ఆవకాశాలు లేవు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీలోనూ మాస్టర్ కు పాజిటివ్ టాక్ రాలేదు. పోటీకి వచ్చిన శింబు ఈశ్వరన్ దీని కన్నా కొంత బెటర్ గా ఉందని మాస్ ఫీలయ్యారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు కేవలం క్రేజ్, ఫాన్ ఫాలోయింగ్ మీద మాస్టర్ గట్టెక్కాడు కానీ ఇందులో ఉన్న కంటెంట్ కి వంద కోట్లు రావడం అంటే గొప్ప విషయమే. ఫలితం సంగతి ఎలా ఉన్నా ఇకపై విజయ్ డబ్బింగ్ సినిమాలకు కనీస రేట్ పది కోట్ల దాకా ఫిక్సవ్వడం ఖాయంగా కనిపిస్తోంది మరి.