iDreamPost
android-app
ios-app

మెగా హీరో చేతికి మాస్ ప్రాజెక్టు

  • Published Jun 07, 2021 | 7:36 AM Updated Updated Jun 07, 2021 | 7:36 AM
మెగా హీరో చేతికి మాస్ ప్రాజెక్టు

ఒకేసారి రెండు సినిమాలతో బిజీగా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తర్వాత చేయబోయే వాటి మీద ఇంకా క్లారిటీ లేదు. గని షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. కరోనా వల్ల బ్రేక్ పడటంతో ప్రత్యేకంగా వేసిన సెట్ కు సాంకేతిక ఇబ్బందుల వచ్చి తీసేయడంతో దాన్ని మళ్ళీ వేయబోతున్నారు. ఖచ్చితంగా ఎప్పుడు పూర్తవుతుందో ఇంకా క్లారిటీ లేదు. దీనికి సంబంధించి నిర్మాతల మధ్య ఏవో విబేధాలు వచ్చాయని, వరుణ్ అవుట్ ఫుట్ మీద అంత సంతృప్తిగా లేడని పుకార్లు వచ్చాయి కానీ మేకర్స్ మాత్రం వాటిని ఖండిస్తున్నారు. ముందు అనౌన్స్ చేసిన జూలై 30 రిలీజ్ చేయడం అసాధ్యమే. చేతిలో ఇంకో నలభై రోజులు మాత్రమే ఉండటంతో అది మీట్ కాలేరు.

ఇక ఎఫ్2 సీక్వెల్ గా చేస్తున్న ఎఫ్3 కూడా అతి త్వరలో రీ స్టార్ట్ కాబోతోంది. వెంకటేష్ మెహ్రీన్ లతో మరోసారి జట్టు కడుతున్న వరుణ్ ఇది ఫస్ట్ పార్ట్ కంటే డబుల్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని మాస్ ఎలిమెంట్స్ కూడా జోడించినట్టు ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉండగా లేటెస్ట్ గాసిప్ ప్రకారం రవితేజతో దర్శకుడు త్రినాథరావు నక్కిన చేయాల్సిన సబ్జెక్టు ఇప్పుడు వరుణ్ తేజ్ దగ్గరకు వెళ్లిందట. ఫైనల్ వెర్షన్ మీద అంతగా సంతృప్తి చెందని మాస్ రాజా దాన్ని హోల్డ్ లో పెట్టినట్టు ఫిలిం నగర్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా ఉంది. నిజమైనా ఆశ్చర్యం లేదు.

మరి వరుణ్ తేజ్ నిజంగా ఇంకో హీరో వద్దనుకున్నా కథను చేస్తాడా అనేది వేచి చూడాలి. అయితే ఈ తరహా ఉదంతాలు పరిశ్రమలో మాములే. ఇడియట్, అతడు, పోకిరి కథలు ముందు విన్నది పవన్ కళ్యానే. ఎందుకో నచ్చక నో చెప్పాడు. అవి ఎంత చరిత్ర సృష్టించాయో అందరికీ గుర్తే. ఇటీవలే రామ్ తో లింగుస్వామి చేస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కూడా గతంలో అల్లు అర్జున్ కి చెప్పిందేనని ఈ మధ్య  కాస్త గట్టిగానే వినిపిస్తోంది. ఇలా చేతులు మారడం సహజమే కానీ హిట్ అయితే ఓకే లేకపోతే ఆ బాధ మాములు సందర్భాల్లో కంటే కాస్త ఎక్కువ ఉంటుంది. అధికారికంగా చెప్పే దాక లెట్ వెయిట్ అండ్ సి