సంక్రాంతి ఆఖరున వస్తున్న ఎంత మంచివాడవురాకు రేపు అగ్ని పరీక్షే ఎదురు కానుంది. ఇప్పటికే బరిలో దిగిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు రెండూ పోటా పోటీగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి. టాక్ పరంగా అల్లు అర్జున్ సినిమా ఒక మెట్టు పైన ఉన్నప్పటికీ పండగ సెలవుల సీజన్ కావడంతో మహేష్ మూవీ సైతం బాగా వసూలు చేసుకుంటోంది. మరోవైపు దర్బార్ ను మనవాళ్ళు రిజెక్ట్ చేసినా డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ తో చాలా థియేటర్లలో కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఎంత మంచివాడవురా వీటి మధ్య నెగ్గుకురావాలంటే సూపర్ సాలిడ్ రిపోర్ట్స్ రావాలి. అసలే సాఫ్ట్ జానర్ లో వస్తున్న ఫామిలీ మూవీ. మాస్ ఎలిమెంట్స్ ఉన్నట్టు ట్రైలర్ లో చూపించారు కానీ అవి ఏ మోతాదులో ఉన్నాయో తెలియాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ గత కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించాడు. 118 బిజినెస్ రేంజ్ తక్కువ కావడం వల్ల సేఫ్ వెంచర్ అయ్యింది కానీ ఇతని మీద భారీ ఇన్వెస్ట్ మెంట్ రిస్క్ అయితే ఎంత మంచివాడవురా యూనిట్ లెక్క వేరుగా ఉన్నట్టు కనిపిస్తోంది.
ఎలాగూ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి మొదటి రెండు రోజులు స్క్రీన్లు తక్కువగా ఉన్నా ఆ తర్వాత పికప్ అవుతుందని అటుపై 24వ తేదీ రవితేజ డిస్కో రాజా వచ్చేదాకా తొమ్మిది రోజుల గ్యాప్ ఉంటుంది కాబట్టి వర్క్ అవుట్ చేసుకోవచ్చనే అంచనాలో ఉన్నట్టు తెలిసింది. ఏదైతేనేం సినిమా ప్రియులకు టాలీవుడ్ ఈ సంక్రాంతికి మంచి బొనాంజాని ఇచ్చింది. ఇంకో రెండు బాలీవుడ్ సినిమాలు వచ్చినప్పటికీ వీటి ధాటికి ఎవరూ పట్టించుకోకపోవడంతో తానాజీ, చెపాక్ లు పెద్దగా స్పందద దక్కించుకోలేదు. సతీష్ వేగ్నేశ దర్శకత్వం వహించిన ఎంత మంచివాడవురాకు గోపి సుందర్ సంగీతం అందించారు.