iDreamPost
android-app
ios-app

సంగారెడ్డిలో ఘోర రోడ్డుప్రమాదం – ఆరుగురి దుర్మరణం

సంగారెడ్డిలో ఘోర రోడ్డుప్రమాదం – ఆరుగురి దుర్మరణం

తెలంగాణ రోడ్లు నెత్తురోడాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటి వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా నలుగురు గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే జార్ఖండ్‌కు చెందిన కార్మికులు(కార్పెంటర్లు) గచ్చిబౌలినుండి తమ సొంత రాష్ట్రానికి గ్జైలో వాహనంలో వెళ్తుండగా అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బాధితులు ప్రయాణిస్తున్న గ్జైలో వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో వాహనంలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలం బాధితుల మృతదేహాలతో భీతావహంగా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి కారణం అయిన వాహనాన్ని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.