దేశ రాజకీయాల్లో ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు చాలా ప్రత్యేకం. ఇక్కడ మెజారిటీ సాధించి అత్యధిక స్థానాలు గెలుచుకుంటే దాదాపు అదే గాలి దేశమంతటా భావిస్తుందని పార్టీల నమ్మిక. ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని అంచనా వేసే దేశ రాజకీయాలను చాలామంది ఎలా ఉంటాయి అన్నది చెబుతారు. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం 2022 లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనుంది. దీంతో ఇప్పటి నుంచే కాషాయం పార్టీను గద్దె దింపడానికి విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఉత్తరప్రదేశ్లోని అజమ్ఘడ్ లో ఓ వివాహ వేడుకలో పాల్గొనడానికి వెళ్లగా, అదే వేడుకకు వచ్చిన ప్రగతిశీల సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ సుదీర్ఘంగా చర్చలు జరపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మజ్లిస్ పోటీకీ సై!
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ లో ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీచేయాలని ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీ భావిస్తోంది. పక్కనే ఉన్న బీహార్లో పోటీ చేసి 4 స్థానాలను గెలుచుకున్న ఉత్సాహంలో ఉన్న మజ్లిస్ ఉత్తరప్రదేశ్లో పోటీ చేసేందుకు, అనువైన మిత్రుల కోసం వెతుకుతోంది. దీనిలో భాగంగానే శివపాల్ యాదవ్ తో అసదుద్దీన్ ఓవైసీ భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమాజ్ వాది పార్టీ అలయన్స్ లో ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్, ప్రగతి సీల్ సమాజ్ వాది పార్టీ తమ కూటమిలోకి మజ్లిస్ పార్టీని సైతం చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. మజ్లిస్ ను తమ వైపు తిప్పుకుంటే ఉత్తరప్రదేశ్ లో ఉన్న సుమారు 2.50 కోట్ల ముస్లిం ఓటర్ల మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 403 అసెంబ్లీ నియోజకవర్గాల ఉత్తరప్రదేశ్లో సుమారు 70 స్థానాల్లో ముస్లిం ఓటర్లు గెలుపు ప్రభావం చూపుతారని లెక్కలు ఉన్నాయి. దీంతో తమ కూటమిలో మజ్లిస్ పార్టీని చేర్చుకుంటే ఖచ్చితంగా అది సానుకూల ప్రభావం చూపుతుందని సమాజ్ నేతలు భావించి మొదటి విడతగా శివపాల్ యాదవ్ ను పంపించినట్లు తెలుస్తోంది.
పశ్చిమ ప్రాంతంలో ప్రభావం
2017 లో శివపాల్ యాదవ్ సమాజ్వాది పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని స్థాపించారు. ఈయన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు బంధువే. సమాజ్వాదీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన శివపాల్ యాదవ్ మాయావతి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రతిపక్ష నేతగా సైతం వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతంలో మంచి పట్టు ఉన్న ఆయనకు సమాజ్వాదీ పార్టీలో సరైన ప్రాధాన్యం లభించడం లేదన్న కారణం తో పాటు, పార్టీ అంతర్గత వ్యవహారాల మీద పలు విమర్శలు చేసి బయటకు వచ్చి 2017 లో ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీలో స్థాపించారు. ప్రస్తుతం శివపాల్ యాదవ్ సమాజవాది పార్టీ కూటమిలోని కొనసాగుతున్న, ఎన్నికల నాటికి ఆయన మనసులో ఏముంటుంది అన్నది అంతుబట్టకుండా ఉంది. 9 నుంచి 12 జిల్లాల్లో తన ప్రభావం గట్టిగా ఉంటుందని భావిస్తున్న ఆయన ప్రస్తుతం మాజీ కూటమిలోకి మజ్లిస్ పార్టీ కనుక చేరితే మరింత బలోపేతం అవుతామని, ముస్లిం వోటర్లు కీలకమైన చోట ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందనే కోణంలోనే ఇప్పుడు భేటీ అయినట్లు తెలుస్తోంది.
మజ్లీస్ కు తోడు అవసరం
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త గా ప్రవేశిస్తున్న మజ్లీస్ పార్టీ కూడా ఒంటరిగా వెళ్లడం ఇష్టం లేదు. దానివల్ల ఓటర్లు ఎలా తమను రిసీవ్ చేసుకుంటారు అన్న విషయం మీద కాస్త అనుమానాలు ఉన్నాయి. గతంలో దక్షిణాది ముస్లిం పార్టీగా పేరుపడిన మజ్లిస్ పార్టీ గత బీహార్ ఎన్నికలలో మంచి ప్రభావాన్ని చూపింది. దింతో ఇప్పుడు ఇటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల రంగంలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్న వేళ వచ్చే యేడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్ని కిలోమీటర్ సైతం ఎంఐఎం అధినేత దృష్టి పెట్టినట్లు ఈ భేటీని బట్టి తెలుస్తోంది. మరి ఆయన అడుగు లు ఎలా ఉంటాయి ఏ కూటమి వైపు మొగ్గు చూపుతారు అన్నది తెలియాలి.