iDreamPost
android-app
ios-app

బన్నీకి మహేష్ కొత్త టార్గెట్

  • Published Apr 04, 2020 | 6:03 AM Updated Updated Apr 04, 2020 | 6:03 AM
బన్నీకి మహేష్ కొత్త టార్గెట్

సంక్రాంతి పోరులో నువ్వా నేనా అనే రీతిలో తలపడిన మహేష్ బాబు, అల్లు అర్జున్ ఎట్టకేలకు భారీ వసూళ్లతో తమ యుద్ధాన్ని ముగించారు. లక్కీగా 50 రోజుల తర్వాత కరోనా ఎటాక్ అయ్యింది కానీ లేదంటే ఈ రెండు సినిమాలు చాలా నష్టపోయేవి. అయితే జనం అభిప్రాయంలో, బాక్స్ ఆఫీస్ వసూళ్ల లెక్కల్లో బన్నీ విన్నర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మాకూ నాన్ బాహుబలి రికార్డులు వచ్చాయని సరిలేరు నీకెవ్వరు టీమ్ చెప్పుకుంది కాని ఫిఫ్టీ డేస్ సెంటర్స్ లో వచ్చిన వ్యత్యాసమే చెబుతుంది విజేత ఎవరో. ఇదిలా ఉండగా మరో విషయంలో ఈ హీరోలు పోటీ పడక తప్పేలా లేదు.

ఇటీవలే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ద్వారా జెమినిలో ప్రసారమైన సరిలేరు నీకెవ్వరు టిఆర్పి రేటింగ్ 23.4 వచ్చి ఏకంగా బాహుబలిని దాటేసి షాక్ ఇచ్చింది. ఇండస్ట్రీ హిట్స్ కే రాని భారీ వ్యూస్ ని సాధించి ఔరా అనిపించింది. ఇక్కడ లాక్ డౌన్ వల్ల జనాలంతా ఇంట్లోనే ఉండటం, పండగ రోజు ప్రసారం చేయడం లాంటి అంశాలు బాగా కలిసి వచ్చాయి. అందుకే ఊహించని రీతిలో చిన్నితెరపై సరిలేరు బ్లాస్టింగ్ హిట్ అయ్యింది. ఇప్పుడు అల వైకుంఠపురములో వంతు వచ్చింది. దీని హక్కులు కూడా అదే ఛానల్ వద్ద ఉన్నాయి. ఇప్పటికే ఓటిటి లో స్ట్రీమింగ్ చేశారు. జరిగి నెల దాటుతోంది. ఇప్పుడు దీని టార్గెట్ సరిలేరు రేటింగ్ ని క్రాస్ చేయడమే. కానీ ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ దశలవారీగా తీసేసే అవకాశాలు ఉన్నాయని టాక్ ఉంది.

ఆ లోపుగా టెలికాస్ట్ అయితే దాన్ని బీట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అల వైకుంఠపురములోకి ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు బలంగా ఉంటుంది. సరైన సమయంలో టీవీలో వస్తే రేటింగ్ మీటర్ కి హద్దులు ఉండవు. కాకపోతే ఉగాది తరహాలో దగ్గరలో ఎలాంటి సందర్భం లేదు. మరి సదరు ఛానల్ ఎప్పుడు వేసినా భారీ స్పందన వస్తుందని తర్వాత ప్లాన్ చేస్తుందో లేక ఈ పది రోజుల్లో మంచి టైం చూసుకుని వేస్తుందో తెలియదు. ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ సినిమా రేటింగ్ గురించి ఓ రేంజ్ లో వైరల్ చేసుకుంటున్నారు. మాకు అవకాశం రాకపోదా అని స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. బహుశా చాలా కాలం తర్వాత ఇలా టీవీ రేటింగ్స్ కోసం అభిమానులు పోటీ పడటం గమనించవచ్చు. ప్రస్తుతం షూటింగ్ బ్రేక్ లో ఉన్న అల్లు అర్జున్, మహేష్ బాబులు పూర్తి సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నారు.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş