ప్రతి ఎన్నికలు పార్టీలు గెలిచిన స్థానాల సంఖ్యలకు అతీతంగా,అంతర్లీనంగా ఒక సందేశాన్ని ఇస్తాయి.
రాజకీయాల్లో నిబద్దత ,గెలుపు ఓటములకు అతీతంగా, నికరంగా నిత్యం ప్రజలతో మమేకం అయ్యే నాయకులకు ఆదరణ ఉంటుంది,అలాంటి నాయకుల వలన వారి పార్టీలకు లబ్ది చేకూరుతుంది. పాలిటిక్స్ వ్యాపారం కాదు,పార్ట్ టైం వ్యవహారం అంతకన్నా కాదు.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి గెలిచి,హర్యానా లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. గెలిచి అధికారపీఠం ఎక్కిన వారికి అభినందనలతో అగ్రతాంబూలం దక్కుతుంది,ఏ గెలుపును తక్కువ చెయ్యకూడదు. అలాగే అధికారంలోకి రాలేక పోయిన పార్టీల కూడా సంతోషపడి గెలుపులు కొన్ని ఉంటాయి.
78 సంవత్సరాల శరద్ పవార్ నిజంగా యోధుడే !1978లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఇప్పటి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న ఏకైక నాయకుడు శరద్ పవార్,దేశంలో నిజమైన సీనియర్ నాయకుడు. ఈ ఎన్నికల్లో శరద్ పవార్ NCP తుడిచిపెట్టుకొని పోతుందని ఎగ్జిట్ పోల్స్ ,జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలను తలకిందులు చేస్తూ 54 స్థానాల్లో NCP ని గెలిపించుకున్నారు. గత ఎన్నికల్లో NCP కి 41 స్థానాలు మాత్రమే వొచ్చాయి. కాంగ్రెస్ కూడా గతంలో గెలిచిన 42 స్థానాలకు అదనంగా మరో మూడుస్థానాలు,మొత్తంగా 45 స్థానాలు గెలిచింది.
సరిగ్గా నెల కిందట 25-Sep -2019న శరద్ పవర్ మీద ED కేసు నమోదు చేసి విచారణకు పిలిచింది. ఎలాంటి దాడి నైనా ఎదుర్కుంటాను కానీ బీజేపీ కి లొంగను అని శరద్ పవర్ ప్రకటించి ED విచారణకు హాజరయ్యారు.
గత సెప్టెంబర్లో మరాఠా ల కంచు కోట అయిన “సతార” లోక్ సభ సభ్యుడు NCP నేత ఉదయాన్ రాజే భోసలే పార్టీకి ,ఎంపీ పదవి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. ఈ ఫిరాయింపుతోనే NCP పని అయిపొయింది,ఆపార్టీ రాజకీయంగా కనుమరుగవుతుందన్న ప్రచారం ఊపందుకొంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు సతారా లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉదయాన్ రాజే భోసలే ను ఓడించి శరద్ పవార్ మారాఠ ప్రాంతంలో తన పట్టును నిరూపించుకున్నారు. ఉదయాన్ రాజే ఓటమిని బీజేపీ ఓటమిగా కాకుండా ఫిరాయింపుదారుడి ఓటమిగా చూడాలి.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కి కొంత ప్రభుత్వ వ్యతిరేకత ,తిరుగుబాటు అభ్యర్థులు నష్టం చేశారు. పైకి చూడటానికి గతంలో కన్నా సీట్స్ తగ్గినట్లు కనిపించినా బీజేపీ 2014 ఎన్నికల్లో 260 స్థానాల్లో పోటీ చేసి 122 సీట్లు గెలుపొందగా ఈ ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేసి 105 సీట్లు గెలుచుకుంది.బీజేపీ కి పరిస్థితి అనుకూలంగా లేదని గ్రహించి అమిత్ షా శివసేన డిమాండ్లను అంగీకరించి పొత్తుకుదుర్చుకున్నారు.
కాంగ్రెస్ పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడిన MIM ,VBA కనీసం 30 స్థానాలలో కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి .
హర్యానాలో కాంగ్రెస్ ఊహించిన దానికన్నా మంచిఫలితాలు సాధించింది. సోనియా గాంధీ పార్టీ పగ్గాలు తీసుకున్న ఆతరువాత హర్యానా కాంగ్రెస్ బాధ్యతలు మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా కి ఇవ్వటం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసివొచ్చింది. భూపేందర్ అన్నట్లు ఆయనకు 4-5 నేలల ముందు బాధ్యతలు ఇచ్చివుంటే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి.
INLD కేవలం ఒక్క స్థానంలోనే (ఓం ప్రకాష్ చౌతాలా కొడుకు అభయ్ సింగ్ చౌతాలా) మాత్రమే గెలిచింది. INLD నుంచి బహిష్కరణకు గురైన ఓం ప్రకాష్ చౌతాలా కొడుకు అజయ్ చౌతాలా కొడుకు దుశ్యంత్ స్థాపించిన JJP(జన నాయక్ జనతా పార్టీ) 10 సీట్స్ గెలుచుకుంది.
జాట్స్ ,దళిత్ ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్ కు పడగా,INLD ఓట్ బాంక్ మొత్తం JJP కి,జాట్ యేతర ఓట్లు బీజేపీ కి పడ్డట్లు కనిపిస్తుంది. డేరా బాబా శిష్యులు బీజేపీ కి వ్యతిరేకంగా పనిచేశారు.
40 స్థానాలు సాధించిన బీజేపీ INLD మరియు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
నిన్న దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాలలో గెలిచింది. వీటిలో 3 స్థానాలు ఇతరపార్టీలు ప్రాతినిధ్య వహించినవి. బీజేపీ 6 సిట్టింగ్ స్థానాలలో ఓడిపోయింది. బీజేపీ కోల్పోయిన స్థానాలలో గుజరాత్ లో 2, పంజాబ్ ,రాజస్థాన్,ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్లో ఒకో స్థానం కోల్పోయింది.
గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి రాజకీయాలను అర్ధంచేసుకోవటాన్ని సంక్లిష్టం చేస్తుంది. బీజేపీ ఓడిపోయిన 2 స్థానాలలో ఒకటి అల్పేష్ ఠాకూర్ స్థానం. గత గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ కి వ్యతిరేకంగా బీసీ నాయకుడిగా పోరాడి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలిచిన అల్పేష్ ఈమధ్య కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ లో చేరారు. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో అల్పేష్ మీద కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు,ఫిరాయింపుదారులు అందరు ఓడిపోతున్నారు.
తమిళనాడు ఉప ఎన్నికల్లో AIADMK రెండు స్థానాలు గెలవటం ఆశ్చర్యం.
భారత రాజకీయాల్లో ప్రతిపక్షానికి స్థానం ఉంది అని ఈ ఎన్నికలు నిరూపించాయి.