Idream media
Idream media
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన, ఎన్సీపి, కాంగ్రెస్ పార్టీలు తమ ఉమ్మడి కార్యచరణను ప్రకటించాయి. పూర్తిగా విరుద్ద వైరుద్యాలున్న ఈ మూడు పార్టీలు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ తో ఇక కలిసి ముందుకుసాగాలని నిర్ణయించాయి..
నిరుద్యోగం, రైతుల సమస్యలు, సామాజిక న్యాయం, ఆరోగ్యం, మహిళలు, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, విద్య , కళలు, పర్యాటకం తదితర అంశాలను ప్రముఖంగా కనీస ఉమ్మడి కార్యచరణలో ప్రస్తావించారు. రైతులకు రుణమాఫీ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో 80శాతం స్థానికులకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో రూ.10 కే భోజనం అందిస్తామన్న శివసేన హామీతో పాటు రూపాయి క్లినిక్ ల అంశాన్ని కూడా కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో చేర్చారు. హిందూత్వమే ప్రధాన అజెండాగా ఇన్ని సంవత్సరాలు ముందుకువెళ్లిన శివసేన ఇప్పుడు మహా వికాస్ అఘాడీ కూటమితో కలసి సెక్యూలరిజంతో ముందుకు సాగాల్సివస్తోంది.. ఉమ్మడి కార్యచరణలో మహారాష్ట్ర ప్రజలపై వరాల జల్లులు కురిపించి, వాటి అమలులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. అయితే ఇప్పటికే కొంచెం దూరంలో అధికారాన్ని దూరం చేసుకున్న బీజేపి, మహా వికాస్ అఘాడీ కూటమి తీసుకునే ప్రతి నిర్ణయంలో తప్పులను ఎత్తిచూపే ప్రతిపక్ష పార్టీ హోదాలో చురుకుగా కదలాలని చూస్తోంది. ఆపార్టీ ప్రతినిధి ఫడ్నవీస్ కూడా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.