iDreamPost
android-app
ios-app

లారెన్స్ మాస్టర్ కు లక్కీ ఛాన్స్

  • Published May 12, 2020 | 12:07 PM Updated Updated May 12, 2020 | 12:07 PM
లారెన్స్ మాస్టర్ కు లక్కీ ఛాన్స్

టాలీవుడ్ లో డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆపై దర్శకుడిగా ఎదిగి తనకంటూ స్వంత మాస్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న లారెన్స్ రాఘవేంద్ర ఇటీవలే చంద్రముఖి 2లో ఎంపికై సూపర్ స్టార్ రజినీకాంత్ తో మొదటిసారి నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు వాసు ద్వారా తన పాత్ర తాలూకు చిన్న లీక్స్ బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే దీని తర్వాత రజినిని తన స్వంత డైరెక్షన్ లో నటించేలా మాట తీసుకున్నాడట లారెన్స్. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ వినిపిస్తే అది బాగా నచ్చడంతో తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.

రజని ప్రస్తుతం శివతో మూవీ పూర్తయ్యాక చంద్రముఖి 2 షూటింగ్ లో జాయినవుతారు. ఆ తర్వాతే లారెన్స్ సినిమా ఉంటుంది. ఎలాంటి కథ అనే క్లారిటీ మాత్రం ఇప్పటికి లేదు. ఇదే బంపర్ ఛాన్స్ అనుకుంటే మరో స్టార్ హీరో విజయ్ కూడా లారెన్స్ కు కమిట్ అవ్వొచ్చనే టాక్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మాస్టర్ విడుదల కోసం ఎదురు చూస్తున్న విజయ్ దాని తర్వాత మురుగదాస్ తో తుపాకీ సీక్వెల్ మొదలుపెడతారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత సుధా కొంగర ప్రాజెక్ట్ ఉంటుందన్నారు కానీ దాని గురించి స్పష్టత లేదు.

ఈలోగా లారెన్స్ ఒక స్టోరీ చెబితే అది విజయ్ కి నచ్చిందట. గత కొన్నేళ్లుగా హారర్ జానర్ కే ఫిక్స్ అయిపోయిన లారెన్స్ రజిని, విజయ్ లకు మంచి మాస్ మసాలాలు ఉన్న కమర్షియల్ సబ్జెక్టులు చెప్పాడట. తెలుగులో లారెన్స్ మొదట్లో చేసినవి ఇలాంటివే. మాస్, డాన్, స్టైల్ ఇవన్నీ హీరోయిజంని బాగా ఎలివేట్ చేసినవి. ఇప్పుడింత పెద్ద స్టార్లతో సినిమాలంటే ఏ రేంజ్ లో చూపిస్తాడో వేరే చెప్పాలా. అక్షయ్ కుమార్ తో కాంచన రీమేక్ గా హిందీలో రూపొందించిన లక్స్మీ బాంబ్ విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ అయ్యాక దీనికి సంబంధించిన ప్రకటన చేయబోతున్నారు. ఓటిటి రిలీజ్ అన్నారు కానీ ప్రస్తుతానికి ఆ సూచనలేమి కనిపించడం లేదు