iDreamPost
android-app
ios-app

చైతు సినిమా విడుదల క్లారిటీ

  • Published Jun 16, 2021 | 6:26 AM Updated Updated Jun 16, 2021 | 6:26 AM
చైతు సినిమా విడుదల క్లారిటీ

లాక్ డౌన్ కథ క్లైమాక్స్ కు వస్తోంది. రేపో మాపో కాస్త అధిక స్థాయిలోనే సడలింపులు ఉండబోతున్నాయి. థియేటర్లు తెరుచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కాదు కానీ హాళ్లు తెరిచి వాటిని శానిటైజ్ చేసి, సీట్ల మధ్య గ్యాప్ కోసం మార్కింగ్ చేసి, వెళ్ళిపోయిన సిబ్బందిని తిరిగి పిలిపించి మొత్తం సిద్ధం చేయడానికి ఎంతలేదన్నా కనీసం రెండు వారాలు పడుతుంది. కొన్ని యాజమాన్యాలు ఇప్పటికే ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నాయి. గత ఏప్రిల్ 9న వకీల్ సాబ్ వచ్చాక ఇంకే భారీ సినిమా రిలీజ్ కాలేదు. నెక్స్ట్ క్యూలో ఉన్నది లవ్ స్టోరీ కాబట్టి ఇప్పుడు కూడా అందరి చూపు దాని మీదే ఉంది. ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

నిర్మాత సునీల్ నారంగ్ దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. నైట్ కర్ఫ్యూ తీసేసి సెకండ్ షోలకు అనుమతి ఇచ్చాక వారం వేచి చూసి అప్పుడు లవ్ స్టోరీ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీకే అనుమతులు ఉన్నా సరే విడుదల చేసేలా సంకేతాలు ఇచ్చాయి. ఒకవేళ ఓ నెల రోజుల పాటు మూడు షోలు మాత్రమే పర్మిషన్ ఇచ్చి, రాత్రి 9 నుంచి ఉదయం దాకా లాక్ డౌన్ అంటే మాత్రం లవ్ స్టోరీ వచ్చేది ఆగస్ట్ లేదా ఆ తర్వాతే. జూలైలో చిన్న సినిమాలు షెడ్యూల్ చేసుకోవడం ఉత్తమం. అయితే  ప్రస్తుతానికి ఎలాంటి సంకేతాలు రావడం లేదు కానీ మరికొద్ది రోజుల్లో ఒక్కొక్కరుగా అనౌన్స్ చేయబోతున్నారు.

లవ్ స్టోరీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చాక సారంగ దరియా పాట హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి ఫిదా తరహాలో పోటెత్తుతారని నిర్మాతల నమ్మకం. అందుకే కరోనా పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారు. కేవలం మాస్ ని నమ్ముకునే వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్ లవ్ స్టోరీలో లేదు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్ ఆదరణ చాలా అవసరం. ఈ లెక్కన చూస్తే ఆగస్ట్ చివరి వారం కంటే ముందు లవ్ స్టోరీ రావడం అనుమానమే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రేమకథకు నాగచైతన్య సాయిపల్లవి కాంబినేషన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది