సాధారణంగా బైక్‌పై వెళ్తున్న వారు హెల్మెట్ ధరించకుంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే 409 లారీలో వెళ్తున్న డ్రైవర్ హెల్మెట్ వేసుకోలేదని సదరు డ్రైవర్‌కు జరిమానా విధించిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార్‌లో చోటుచేసుకుంది. దీంతో రసీదు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార సమీపంలోని దాండేలి నగరంలో 409 వాహన డ్రైవర్‌గా నజీర్ ఇంటికి పోలీసులు నోటీసు పంపారు. హెల్మెట్ ధరించ లేదని జరిమానా చెల్లించాలని నోటీసు పంపారు. దీంతో పోలీసులు నోటీసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల మోటారు వాహనాల చట్టం లో అనేక మార్పులు చేసింది. ప్రమాదాలు అరికట్టేందుకు నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు భారీగా పెంచింది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. కేంద్రం చర్యల వల్ల వాహనదారుల్లో మార్పు వస్తోంది. జరిమానాలు తక్కువగా ఉన్న సమయంలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులు ఇప్పుడు తప్పక ఉపయోగిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో వెళ్లే వాహన దారుల్లో దాదాపు 95 శాతం హెల్మెట్ పెట్టుకునే వెళుతున్నారు. అధిక జరిమానా విధించినా, లేదా పైన పేర్కొన్నట్లు అత్యుత్సాహం తో జరిమానా వేసినా ఆ విషయం వైరల్ అవుతోంది.