మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సాక్షి దినపత్రికపై పరువునష్టం దావా వేశారు. ఈ రోజు శనివారం విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఈ దావా దాఖలు చేశారు. ఒరిజినల్ సూట్ 6/2020 నంబరుతో ఈ వ్యాజ్యం దాఖలైంది.
Read Also: చంద్రబాబుకి జైలు తప్పదు
2019 అక్టోబర్ 22వ తేదీన ‘‘ చినబాబు చిరుతిండి 25 లక్షలండి’’ శీర్షికన సాక్షి మెయిన్ పేజీలో కథనం ప్రచురితమైంది. విమానాశ్రయంలో విశ్రాంతి తీసుకునే సమయంలో నారా లోకేష్ తిన్న చిరుతిండికి 25 లక్షల బిల్లు ప్రభుత్వం చెల్లించిందని ఈ కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే లక్ష్యంతో సాక్షి కథనం ప్రచురించిందని లోకేష్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ మేరకు 75 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు.
4218