iDreamPost
android-app
ios-app

కృత్రిమ మేథస్సు సంవత్సరం గా 2020

కృత్రిమ మేథస్సు సంవత్సరం గా 2020

‘కృత్రిమ మేథస్సు సంవత్సరం’గా 2020ను ప్రకటిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. వ్యవసాయం, పట్టణ రవాణా, ఆరోగ్య రక్షణ రంగాల్లో కృత్రిమ మేథస్సు వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నాస్కామ్‌ అధ్యక్షురాలు దేవయాని ఘోష్‌ తో ప్రగతిభవన్‌లో శుక్రవారం కేటీఆర్‌ భేటీ అయ్యారు. వచ్చే ఏడాది పొడవునా కృత్రిమ మేథస్సు అంశంపై అనేక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. నూతన సాంకేతికతలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను దేవయానికి కేటీఆర్‌ వివరించారు.  డేటా సైన్సెస్‌లో యువతకు శిక్షణ ఇవ్వడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై దేవయాని హర్షం వ్యక్తం చేశారు.