iDreamPost
iDreamPost
ఉత్కంఠ భరితంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత టీఆరెస్ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో తమ పార్టీ విజయ కేతనం ఎగురవేసిందని, గత ఏడాది సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన విజయం నమోదు చేసుకున్నామని, మొదటి నుండి ఏ ఎన్నికల్లో గెలిచినా కూడా విజయాలకు పొంగిపోలేదని,అలాగే అపజయాలకు కృంగిపోలేదని చెప్పుకొచ్చారు.
ఇక దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీకి 62వేల పై చిలుకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని, ఈ ఉప ఎన్నికల్లో పార్టీ పిలుపు మేరకు కష్టపడిన ప్రతి కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ఇక ఫలితాల విషయానికి వస్తే తాము ఆశించినట్లుగా రాలేదని, లోపం ఎక్కడ జరిగిందో సమీక్షించుకునేందుకు ఇది ఒక అవకాశంగా తాము తీసుకుంటామని లోతుగా సమీక్షించుకుని ఆ తరువాత తప్పులు సరిదిద్దుకుంటామని చెప్పుకొచ్చారు.