లాక్ డౌన్ తర్వాత ధైర్యంగా థియేటర్లలో అడుగు పెట్టిన రెండో సినిమాగా వచ్చిన క్రాక్ సగం సీటింగ్ కెపాసిటీతోనూ అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకుని ఫైనల్ రన్ ని దాదాపు పూర్తి చేసుకుంది. అక్కడక్కడా కొన్ని కేంద్రాల్లో ఉన్నప్పటికీ కొత్త చిత్రాలు వచ్చిన నేపథ్యంలో కలెక్షన్లు దాదాపు క్లైమాక్స్ కు వచ్చేశాయి. అందులోనూ ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ జరిగిపోవడంతో వివిధ మార్గాల్లో జనం దీన్ని బుల్లితెరపై చూసేశారు. త్వరలో స్టార్ మా ఛానల్ లో వరల్డ్ ప్రీమియర్ ఉందనే ప్రకటనతో ఇకపై టికెట్లు తెగడం కష్టమే. నాలుగు డిజాస్టర్ల తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ కావడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు.
ఇక లెక్కల విషయానికి వస్తే క్రాక్ తెలుగు వెర్షన్ ఫైనల్ గా 36 కోట్ల 11 లక్షల షేర్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే వచ్చింది. ఓవర్ సీస్, రెస్ట్ అఫ్ ఇండియా కలుపుకుకుంటే మరో 2 కోట్ల పై చిలుకు మొత్తం యాడ్ అవుతుంది.ఇటీవలే తమిళ మలయాళంలో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తే అక్కడా 38 లక్షల దాకా రాబట్టుకుని డీసెంట్ అనిపించుకుంది. ఓవరాల్ గా 39 కోట్ల 16 లక్షలతో ఊహించని ఫిగర్స్ ని నమోదు చేయడం విశేషం. ఒకవేళ వంద శాతం సీట్లకు కనక అప్పుడే పర్మిషన్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా దీని స్థాయి ఇంకా పెరిగేది. ఏరియాల వారీగా లెక్కలు ఈ విధంగా ఉన్నాయి.
క్రాక్ ఫుల్ రన్ వసూళ్లు:
ఏరియా | షేర్ |
నైజాం | 12.47cr |
సీడెడ్ | 6.24cr |
ఉత్తరాంధ్ర | 4.79cr |
గుంటూరు | 2.81cr |
క్రిష్ణ | 2.38cr |
ఈస్ట్ గోదావరి | 3.29cr |
వెస్ట్ గోదావరి | 2.34cr |
నెల్లూరు | 1.79cr |
ఆంధ్ర+తెలంగాణా | 36.11cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 1.77cr |
ఓవర్సీస్ | 0.90cr |
ప్రపంచవ్యాప్తంగా | 39.16cr |
ఎలా చూసినా దీన్ని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ గా భావించాలి. రవితేజకు సరైన కథ పడితే తన స్టామినా ఏ స్థాయిలో ఉంటుందో క్రాక్ రుజువు చేసింది. దీని ప్రభావం నేరుగా ఖిలాడీ మీద పడబోతోంది. అనుకున్న దానికన్నా డబుల్ ఫిగర్స్ తో బిజినెస్ కోసం బయ్యర్లు పోటీ పడుతున్నారు. క్రాక్ ఫలితం చూశాకే రవితేజ తాను ఫ్యూచర్ లో చేయబోయే ప్రాజెక్టులను మరోసారి రివైజ్ చేస్తున్నారు. మొత్తానికి ఇంత పెద్ద సక్సెస్ కొట్టిన కిక్ లో మాస్ మహారాజా అభిమానులు ఆనందం మాములుగా లేదు. పరిమితుల మధ్య కూడా ఇలాంటి వసూళ్లు తేవడం పట్ల గర్వంగా ఫీలవుతున్నారు. మళ్ళీ మే 28 దాకా ఖిలాడీ కోసం వెయిట్ చేయాల్సిందే
Verdict – Block Buster