iDreamPost
android-app
ios-app

కిరాక్ అనిపించిన మాస్ పోలీస్ ‘క్రాక్’

  • Published Jan 01, 2021 | 5:53 AM Updated Updated Jan 01, 2021 | 5:53 AM
కిరాక్ అనిపించిన మాస్ పోలీస్ ‘క్రాక్’

రాబోయే సంక్రాంతి పండక్కు ఎక్కువ అంచనాలు మోసుకొస్తున్న సినిమాగా క్రాక్ మీద మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేనప్పటికీ క్రాక్ విషయంలో మాత్రం ట్రేడ్ సైతం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీలవుతోంది. థియేటర్ల ఆక్యుపెన్సీతో సంబంధం లేకుండా బరిలో దిగేందుకు సిద్ధమయ్యింది క్రాక్. ఈ సందర్భంగా న్యూ ఇయర్ ని పురస్కరించుకుని ట్రైలర్ ని రిలీజ్ చేసింది యూనిట్. రవితేజతో డాన్ శీను, బలుపుతో సూపర్ హిట్లు అందించి హ్యాట్రిక్ కి సిద్ధమైన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ కాప్ డ్రామాకు తమన్ సంగీతం సమకూర్చారు.

ఇక వీడియోలో కథను క్లియర్ గా చెప్పేశారు. భయమంటే తెలియని ముక్కుసూటిగా వెళ్లే పోలీస్ ఆఫీసర్ వీర శంకర్(రవితేజ). అవతలి వాడు ఎవడైనా చట్టానికి వ్యతిరేకంగా వస్తే తాట తీస్తాడు. కర్నూలులో అలా చేసే పేరు తెచ్చుకున్న శంకర్ ఒంగోలుకు ట్రాన్ఫర్ అయ్యి వెళ్ళాక అక్కడ రెండు అరాచక శక్తులు(సముతిరఖని-వరలక్ష్మి) ఎదురవుతాయి . ఊహించనంత భారీగా నేర సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆ ఇద్దరి అంతం చూసేందుకు కంకణం కట్టుకుంటాడు వీర శంకర్. తన భార్య(శృతి హాసన్), కొడుకు ప్రాణాలు రిస్క్ అనిపించినా లెక్క చేయడు. మరి ఈ క్రాక్ చివరికి వాళ్ళ భరతం ఎలా పట్టాడు అనేది తెరమీద చూడాల్సిందే

చాలా కాలం తర్వాత రవితేజ రియల్ ఎనర్జీని వాడుకునే సబ్జెక్టు క్రాక్ రూపంలో దొరికింది. లైన్ పరంగా మరీ కొత్తగా అనిపించనప్పటికీ మాస్ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు జాగ్రత్తగా దట్టించినట్టు కనిపిస్తోంది. ప్రతి సీన్ లో కిక్కిచ్చే ఇంటెన్సిటీని జొప్పించారు దర్శకుడు గోపీచంద్. దానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ అయ్యింది. సాయి మాధవ్ బుర్ర డైలాగులు చాలా పవర్ ఫుల్ గా పడ్డాయి. రవిశంకర్, జీవా తదితరులు ఇతర తారాగణం. శృతి హాసన్ గ్లామరస్ గా కనిపించింది. మొత్తానికి కొత్త ఏడాదిలో పర్ఫెక్ట్ స్టార్ట్ అనిపిస్తున్న క్రాక్ ట్రైలర్ చూశాక సినిమా ఖచ్చితంగా చూడాలనిపించేలా ఉంది.

Link Here @ http://bit.ly/3hC9M8T