iDreamPost
android-app
ios-app

చివరి అడుగులో రవితేజ ‘క్రాక్’

  • Published Oct 07, 2020 | 6:10 AM Updated Updated Oct 07, 2020 | 6:10 AM
చివరి అడుగులో రవితేజ ‘క్రాక్’

అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు రేపుతున్న మాస్ మహారాజా రవితేజ క్రాక్ ఇవాళ నుంచి సెట్స్ లోకి అడుగు పెట్టింది . మార్చ్ లాక్ డౌన్ నుంచి ఇప్పటిదాకా బ్రేక్ తీసుకున్న టీం ఇకపై ఏకధాటిగా జరిపే 15 రోజుల సింగల్ షెడ్యూల్ లో బాలన్స్ మొత్తాన్ని పూర్తి చేయనున్నట్టు సమాచారం. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోనే ఇదంతా జరగబోతోంది. ఇప్పటిదాకా షూట్ చేసిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పుడీ షూట్ కంప్లీట్ చేయగానే ప్రమోషన్ పనులు వేగవంతం చేయబోతున్నారు. ఇప్పటికైతే నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ వైపే మొగ్గు చూపుతున్నారు.

క్రిస్మన్ కంతా ప్రభుత్వం ఫుల్ కెపాసిటీకి కనక అనుమతులు ఇస్తే డిసెంబర్ చివరి వారంలో క్రాక్ ని చూసుకోవచ్చు. లేదూ అప్పటికీ పరిస్థితి ఇలాగే ఉందంటే మాత్రం జనవరి లేదా ఆపై నెల వాయిదా వేసుకోక తప్పదు. ఓటిటి ఆఫర్లు అయితే చాలా భారీగా వచ్చిన మాట వాస్తవం. ఒకదశలో డీల్ ఫైనల్ అయ్యిందని కూడా ప్రచారం జరిగింది. కాని మేకర్స్ ఆ వార్తలను ఖండించారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన క్రాక్ లో శృతి హాసన్ హీరొయిన్. తమన్ సంగీతం సమకూరుస్తుండటం ఇప్పటికే హైప్ ని పెంచేసింది. ఒంగోలు ప్రాంతంలో మత్స్యకారుల్లో ఉన్న నేరస్తులను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ కథలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తనదైన మ్యానరిజంతో ఫుల్ ఎనర్జీతో మాస్ రాజా తెరమీద కనిపించి చాలా రోజులే అయ్యింది.

వరసగా వచ్చిన డిజాస్టర్లు మార్కెట్ పరంగా కొంత ఇబ్బంది పెట్టినప్పటికే దమ్మున్న కంటెంట్ పడితే తన సత్తా చాటుకునే టాలెంట్ రవితేజలో ఎలాగూ ఉండనే ఉంది. అది క్రాక్ లో సంపూర్ణంగా ఉపయోగించుకున్నారని ఇన్ సైడ్ టాక్. తమిళ నటులు వరలక్ష్మి శరత్ కుమార్, సముతిర ఖని ఇతర కీలక పాత్రలు పోషించిన క్రాక్ ఆడియో కూడా త్వరలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. విక్రమార్కుడు, పవర్, టచ్ చేసి చూడు తర్వాత ఖాకీ దుస్తుల్లో రవితేజ కనిపించనున్న సినిమా ఇదే. లాక్ డౌన్ కు ముందే వచ్చిన టీజర్ పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఇచ్చింది. మరి వాటిని నిలబెట్టుకునేలా ఉంటే క్రాక్ రూపంలో చాలా గ్యాప్ తర్వాత రవితేజకు హిట్టు దొరికినట్టే. కాకపోతే అది తెలియాలంటే కనీసం ఓ రెండు నెలలు వేచి చూడక తప్పదు