iDreamPost
iDreamPost
తెలంగాణ కొల్లాపూర్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు కటికనేని మధుసూదన్‌రావు అనారోగ్యంతో బాధపడుతు కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రామారావు ఆద్వర్యంలో తెలుగుదేశం పార్టీ 1983లో ఎన్నికల బరిలో దిగినా , కొల్లాపూర్ కోటపైన తొలిసారి తెలుగుదేశం జండాని ఎగరేసి 1994 నుంచి 1999 వరకు ఆ నియోజకవర్గానికి శాసన సభ్యుడిగా మధుసూదన్‌రావు సేవలందించారు.
1999, 2004లో జరిగిన ఎన్నికలలో వరసగా కాంగ్రెస్ అభ్యర్ధి జూపల్లి కృష్ణారావు చేతిలో ఓటమిపాలయిన మధుసుదన్ రావు , 2014 రాష్ట్ర విభజన నేపధ్యంలో భారతీయ జనతాపార్టీలో చేరి తెలంగాణ తొలి ఎన్నికల్లో బీజేపి తరుపున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.. ఆ తరువాత ఆరోగ్యం సహకరించకపొవడంతో రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు. మధుసూదన్‌రావు మృతిపట్ల శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కొల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.