iDreamPost
android-app
ios-app

Koffee With Karan 7: విజయ్ దేవరకొండపై సారా, జాన్వీ కపూర్ హాట్ కామెంట్స్ అంతా పబ్లిసిటీ స్టంట్? లైగ‌ర్ ప్ర‌మోష‌న్ కోసం క‌రణ్ జోహార్ ప్లాన్?

  • Published Jul 27, 2022 | 8:21 PM Updated Updated Jul 27, 2022 | 8:22 PM
Koffee With Karan 7: విజయ్ దేవరకొండపై సారా, జాన్వీ కపూర్ హాట్ కామెంట్స్ అంతా పబ్లిసిటీ స్టంట్? లైగ‌ర్ ప్ర‌మోష‌న్ కోసం క‌రణ్ జోహార్ ప్లాన్?

సోష‌ల్ మీడియాలో కాఫీ విత్ కరణ్ 7 సందడి కాస్త ఎక్కువ‌గానే ఉంది. ప్ర‌తి ఎపిసోడ్ తార‌జువ్వ‌ల‌వుతున్నాయి. స‌మంత ఎపిసోడ్ అయితే చించుబుడ్డిలా సోష‌ల్ మీడియాలో పేలింది. రాబోయే ఎపిసోడ్ కోసం విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా వస్తున్నారు. ట్రైలర్ అప్పుడే దుమ్మురేపేసింది. క‌ర‌ణ్ జోహార్ ఏం మొహ‌మాటంలేకుండా విజ‌య్ ని గాసిప్స్, శృంగారం గురించి అడిగేశాడు. సౌత్ స్టార్లు ఎప్పుడూ ఇలాంటి విష‌యాల జోలికి పోరు. ఈ ట్రైల‌ర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత‌కుముందు, విజ‌య్ దేవ‌ర‌కొండ మీద‌ జాన్వీ హాట్ కామెంట్స్ చేసింది, అతనితో డేటింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పింది. ఈసారి, సారా అలీ ఖాన్ కూడా కాఫీ విత్ కరణ్ 7లో అతను నిజంగా హాటీ, అతనిపై తనకు క్రష్ ఉందని చెప్పింది. విజయ్ దేవరకొండ క్యూటుగా ఆమెకు తన ప్రేమను పంపాడు. ఫ్యాన్స్ కి ఈ రొమాంటిక్ సీన్ బాగా న‌చ్చింది.

ఇదంతా విజ‌య్ దేవ‌ర‌కొండ మీద బాలీవుడ్ కున్న క్ర‌ష్? లేదంటే లైగ‌ర్ ప్రొమేష‌న్ కోసం వేస్తున్న నాట‌క‌మా? సినిమాకు ముందు గాసిప్స్ బాలీవుడ్ లో చాలా కామ‌న్. ఇదే డౌట్ కమల్ ఆర్ ఖాన్ కూడా వ‌చ్చింది.


విజయ్ దేవరకొండ ,అనన్య పాండేల ప్రోమోను చూసిన తర్వాత కరణ్ జోహార్‌ను ట్రోల్ చేస్తున్నాడు. షోలో సెక్స్-లైఫ్‌కి సంబంధించిన ప్రశ్నలు అడిగినందుకు కరణ్ జోహార్‌ను కూడా సరదాగా ఆటాడుకున్నాడు. క‌మ‌ల్ ఖాన్ లాజిక్ ఒక్క‌టే. తన సినిమాల్లో పనిచేసే కుర్ర‌ హీరోలు గెస్ట్‌లుగా కాఫీ విత్ క‌ర‌ణ్ షోకు వ‌చ్చేసరికి, ఆటోమేటిక్‌గా సెక్సీగా, హాట్‌గా ఎలా మారతారు? కమల్ స‌ర‌దా ఓ ట్వీటేశాడు. KRK ని ఎవ‌రూ ప‌ట్టించుకోరు. జ‌స్ట్ ఫ‌న్ గా తీసిపారేస్తారు. కాని ఈసారి మాత్రం చాలామంది అత‌ను చెప్పింది క‌రెక్ట్ అంటున్నారు.


2018లో క‌ర‌ణ్ షోలోనే, సారా అలీ ఖాన్ తనకు కార్తీక్ అంటే ఇష్టమని, అతనితో కాఫీ డేట్‌కి వెళ్లాలనుకుంటున్నానని చెప్పింది. సినిమా తుస్సుమ‌నే స‌రికి అత‌న్ని వ‌దిలిపెట్టింది. ఇప్పుడు వంతు విజ‌య్ దేవ‌ర‌కొండ‌దా?


క‌రణ్ జోహార్ గుట్టును KRK ర‌ట్టుచేశాడా? కొద్ది రోజుల్లో లైగర్ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా సినిమా. తెలుగు రాష్ట్రాల్లోనే వంద‌కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాల‌న్న‌ది పూరి టార్గెట్.

marsbahis girişjojobetjojobet giriş