ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇస్తామని హామీ ఇచ్చామని ఏప్రిల్ 1 నుండి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని మీడియాతో అన్నారు. టీడీపీ వర్గాన్ని ప్రలోభాలకు గురిచేయలేదని వారే స్వచ్చందంగా వైసీపీ లోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీల్లో ఫిరాయింపులను ప్రోత్సహించేది చంద్రబాబేనని తీవ్ర విమర్శలు చేసారు. గతంలో వైసీపీ నాయకులు 23 మందిని, చంద్రబాబు సంతలో పశువుల్లా కొన్నారని వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని కొడాలి నాని గుర్తు చేసారు. వైస్ జగన్ టీడీపీ ఎంఎల్ఏలను కొనడానికి ఎపుడైనా ప్రయత్నాలు చేసారా అని ప్రశ్నించారు. వైస్ జగన్ తలచుకుంటే టీడీపీ నామరూపాల్లేకుండా పోతుందని కొడాలి నాని అన్నారు.
టీడీపీలో పోటీ చేయొద్దని దేవినేని అవినాష్ ని ముందే హెచ్చరించానని, చంద్రబాబు వాడుకుని వదిలేస్తారని చెప్పానని మీడియాకి తెలిపారు. చంద్రబాబు ఇందిరా గాంధీతో పాటు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచాడని కొడాలి నాని ఎద్దేవా చేసారు. జగన్ ని విమర్శించడానికి ఇసుక , కుల, మత విషయాలు తప్ప వేరే విషయాలు ప్రతిపక్షానికి దొరకడం లేదని వ్యాఖ్యానించారు. వైస్ జగన్ ని విమర్శించే హక్కు పవన్ కళ్యాణ్ కి లేదని, పవన్ రాజకీయాల్లో చేసే నటనను చూసి పవన్ నాయుడు, ప్యాకేజ్ స్టార్ అని పేరు పెట్టారని తెలిపారు. ఇసుక కొరతకు సిమెంట్ రేట్స్ పెరగడానికి అసలు సంబంధం లేదని స్పష్టం చేసారు. లోకేష్ రోడ్డు రోలర్ లాంటివాడని టీడీపీని ఎప్పటికైనా తొక్కేస్తాడని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇసుక దీక్షకు కూర్చుంటే కేవలం 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారని అయినా సరే ఇసుక దీక్ష విజయవంతం అయిందని ఆనంద పడుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.